ఓ వైసీపీ ఎంపీటీసీ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాయి. పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఆయన ఇంట్లో నుంచి దాదాపుగా పదిహేను కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడేం జరిగుతుంది. సహజంంగా ఆ గంజాయి వ్యాపారస్తుడ్ని పట్టుకుని ఏ వన్ గా పెట్టి.. అసలు గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది.. మాస్టర్ మైండ్ ఎవరు అని పోలీసులు గుట్టుగా ఆరా తీసి.. వెంటనే కింగ్ పిన్ ను అరెస్ట్ చేయాలి. రాకెట్ ను గుట్టురట్టు చేయాలి. కానీ ఏపీ పోలీసులు మాత్రం ఇలాంటి చట్టబద్ధమైన పనులకు ఎ్పపుడో దూరమయ్యారు. ఇప్పుడు కేసు పెట్టారు కానీ.. ఆ ఎంపీటీసీ పేరు లేదు. ఇతరులపేర్లు ఉన్నాయి.
బాపట్ల జిల్లాలో ఇటీవలి కాలంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. సూర్యలంక బీచ్ ప్రాంతాల్లో గంజాయి అమ్మకం మొత్తం ఓ ముఠా గుప్పిట్లో ఉంది. ఈ ముఠాలో గోవిందు అనే వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు. ఆయనను పోలీసులు డెకాయ్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. కానీ ఓ ఎంపీటీసీని అరెస్ట్ చేస్తే … అత్యున్నత స్థాయిలో ఒత్తిళ్లు వస్తాయని వారు అనుకోలేదు. పెద్ద పెద్ద నేతల నుంచి ఫోన్లు వచ్చాయి. గోవిందుపై కేసు పెట్టినా.. కేసులో ముందుకె్ళ్లినా ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కళ్ల ముందు కనిపించేలా చేశారు. దీంతో పోలీసులు గోవిందు అనే వైసీపీ ఎంపీటీసీ పేరు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీడియాలో విస్తృతంగా ప్రచారమైనా పోలీసులు చివరికి నిందితుడ్ని తప్పించినట్లుగా తెలుస్తోంది. గోవిందునే ప్రధాన నిందితుడిగా పెడతామని చెప్పి.. చివరికి పేరు లేకుండా చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక్కడ అసలు విషయం వైసీపీ ఎంపీటీసీ గంజాయి వ్యాపారం చేయడం కాదు.. అతన్ని పట్టుకుంటే అత్యున్నత స్థాయిలో ఎందుకు కదలిక వచ్చిందనేదే. ఏపీలో గంజాయి వ్యాపారం అనేది వ్యవస్థీకృతంగా మారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా వైసీపీ నేతల పేర్లే వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి అమ్మకాలు పెరిగిపోయాయి. యువత మత్తుకు బానిస అవుతోంది. ఎంత జరుగుతున్నా పోలీసులు మాత్రం గంజాయిని కట్టడి చేశామనే చెబుతున్నారు. కానీ అడపాదడపా పట్టుకున్న వారిని ఇలా వైసీపీ నేతలు.. వదిలి పెట్టేసుకుంటున్నారు. అందుకే.. ఏపీలో గంజాయి వ్యాపారం అంతా వ్యవస్థీకృతం అని.. దీని వెనుక ఓ పెద్ద ముఠా ఉందని.. అది అందరికీ తెలిసిన వ్యక్తులదేనన్న అనుమానాలు బలపడుతున్నాయి.
ఇప్పటికైతే ఏపీ పోలీసులు ఈ గంజాయి కేసుల్ని పట్టుకోవడానికి కూడా ఆలోచించే పరిస్థితుల్ని మెల్లగా కల్పించారు. పట్టుబడిన వారికి అంటే గంజాయి అమ్మకం దారులకు ఉండే బలుకుబడిని ప్రదర్శిస్తున్నారు. ఇది ఏపీలో ప్రస్తుత పరిస్థితిని అద్దం పడుతోంది.