వైసీపీ అరాచకాలపై కలసికట్టుగా పోరాటం చేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించుకున్నారు. చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ఇరువురి మధ్య సుదీర్గంగా జరిగిన చర్చల తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం కాల రాస్తున్న ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడటంపై పోరాడతామని.. పొత్తుల గురించి తర్వాత చర్చిస్తామన్నారు.
ప్రభుత్వంపై పోరాటం.. పొత్తులపై తర్వాత చర్చ : చంద్రబాబు
కుప్పం పర్యటనల్లో తనను అడ్డుకున్న ప్రభుత్వ తీరుకు సంఘిభావ చెప్పడానికి వచ్చిన పవన్‌కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాల పర్యటనలను అడ్డుకునేందుకే.. జీవో నెంబర్ వన్ తీసుకు వచ్చారని గుర్తు చేశారు. నిజానికి జీవోను ముందు నుంచే అమలు చేస్తున్నారని.. విశాఖలో పవన్ కల్యాణ్‌ను అందులో భాగంగానే అడ్డుకున్నారన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో తిరగకుండా కుట్ర చేసేందుకు కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయన్నారు. ఈ ఘటనల్లో ప్రభుత్వం, పోలీసుల కుట్ర ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పటైందని.. మరింత ఉద్ధృతంగా పోరాటం చేస్తామన్నారు. భేటీలో తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఎప్పుడు ఏం చేయాలో మా వ్యూహాలు మాకున్నాయని.. సమయం వచ్చినప్పుడు చెబుతామన్నరాు.
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి తెలుసు.. అందుకే అరాచకాలు : పవన్
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని వైసీపీకి తెలుసని అందుకే అరాచకాలకు పాల్పడుతోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అల్లర్లు, గడవలతో అరాచక విశ్వరూపాన్ని చూపిస్తున్నారని అందుకే ఓటును చీలనివ్వబోమని చెబుతున్నామన్నారు. రాజకీయ పొత్తులపై ఇప్పుడే మాట్లాడటం సరి కాదని.. ఎన్నికలు వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతామన్నారు. ప్రతిపక్షాల హక్కులను జగన్ ప్రభుత్వం కాలరాస్తోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎన్నో దారుణాలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తున్నారని.. ప్రజా జీవితాన్ని అంధకారం చేస్తున్నారన్నారు. చంద్రబాబుతో తాజా రాజకీయ పరిణామాలు, కుప్పం ఘటనలపై చర్చించామన్నారు. బ్రిటిషన్ జీవోతో వప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని .. ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని పవన్ మండిపడ్డారు. ప్రతిపక్షాల హక్కులను జగన్ ప్రభుత్వం కాల రాస్తోందన్నారు. ప్రతిపక్షాల్లో ప్రజల్లోకి వెళ్లకూడనే జీవో తెచ్చారన్నారు. ఫ్లెక్సీలు నిషేధిస్తున్నట్లుగా ప్రకటనలు చేసి.. వైసీపీ నేతలు వాటినే పెడుతున్నారన్నారు. వైసీపీకి ఓ రూల్.. ప్రతిపక్షాలకు ఓ రూలా అని ప్రశ్నించారు.
కలసి పని చేయబోతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు !
పవన్ – చంద్రబాబు భేటీతో కలిసి రెండు పార్టీలు ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు రాజకీయవర్గాలకు పంపినట్లయింది. దీంతో ఇక ముందు ఏపీలో రాజకీయం మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వార్ వన్ సైడ్ అవుతుందన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. వైసీపీ సర్కార్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారు.. ఇక ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయి.