చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్తున్నారు అని తెలిసిన నిమిషాల్లోనే భేటీ జరిగిపోయింది. ఇలా జరుగుతుదంని వైసీపీ నేతలకు సమాచారం లేదు. కానీ విషయం మీడియాలో వచ్చిన తర్వాత హాహాకారాలు మొదలు పెట్టారు. అదీ కూడా ఓ రేంజ్లో . సాధారణంగా ఎవరైనా ప్రతిపక్ష పార్టీల నేతలు కలిస్తే.. వారి భేటీ ముగిసి.. మీడియాతో మాట్లాడిన తరవతా… వారు రాజకీయంగా ఏ అంశాలపై మాట్లాడారో… ఆ అంశాలపై స్పందించడం రాజకీయం. కానీ వైసీపీ రూటే వేరు.
ఇక పవన్ కల్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లారని తెలియగానే.. వ్యక్తిగత బూతులతో ఒక్కో వైసీపీరాజకీయ నేత దిగిపోయారు. సంక్రాంతికి అందరింటికి గంగిరెద్దులు వెళ్తాయని.. అలా చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళారని ట్వీట్ చేశారు. డుడు బసవన్నలా తల ఊపడానికి వెళ్లారని ట్వీట్ చేశారు. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తున్నాడని వెంటనే మీడియాకు పోన్ ఇన్ లు ఇచ్చి… తమ అధినేతకు మెప్పించేప్రయత్నం చేశారు. ఇక గుడివాడ అమర్నాథ్ కూడా అంతే స్పందించారు. సంక్రాంతి పండుగ మామూళ్ల కోసం దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు వెళ్లారంటూ ఏ ట్వీట్ చేశారు.
మంత్రి జోగి రమేష్ సంక్రాంతి ప్యాకేజీ కోసమే చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లారని జోరి గరమేష్ విమర్శించారు. ఏపీని వదిలేసి పక్కరాష్ట్రంలో కూర్చుని జీవో నెంబర్-1పై చర్చించడమేంటని మల్లాది విష్ణు ప్రశ్నించారు. వీళ్ల కలయిక వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదన్నారు. ఎంపీ మార్గాని భరత్ సహా అందరూ ఒకే విధంగా తమ ట్వీట్లు పెట్టారు. ఇదంతా ఐప్యాక్ ప్రణాళిక ట్వీట్లు అని అందరికీ తెలుసు కానీ.. ఇంత వేగంగా హాహాకారాలు ఎందుకని.. వారు మీడియాతో మాట్లాడేంత సేపు కూడా ఎందుకు ఆగలేకపోయారని టీడీపీ, జనసేన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
కారణం ఏదైనా పవన్, చంద్రబాబు ఎప్పుడు కలిసినా వైసీపీ నేతల్లో అలజడి ప్రారంభమవుతుంది. దారుణమైన తిట్లతో విరుచుకపడుతున్నారు. వారి భయం వారి మాటల్లోనే వ్యక్తమవుతోందని విపక్ష పార్టీలు అంటున్నారు.