అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన రిట్ ఆఫ్ మాండమస్ తీర్పుపై స్టే కోసం ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో జనవరి 31వ తేదీన విచారణ జరగనుంది. ఈ కేసులో తాజాగా మొత్తం 161 మందిని ప్రతివాదులుగా గుర్తించారు. వీరందరికీ నోటీసులు జారీ అయ్యాయి. వారంతా అఫిడవిట్లు దాఖలు చేయాలనిుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ప్రతివాదుల్లో కేంద్ర ప్రభుత్వం, అమరావతి రైతులు, వివిధ పార్టీల నేతలు ఉన్నారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పులో కాలపరిమితిపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అసలు మూడు రాజధానులపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఇచ్చిన హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే తమ వాదనలు వినాలని ఎక్కువ మంది కేవియట్ లు దాఖలు చేశారు. వీరందరి వాదనలు విని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రతివాదులు అందరూ వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ కారణంగా అమరావతి కేసులో విచారణ ఎంత కాలం సాగుతుందన్నది న్యాయనిపుణులకు కూడా చిక్కు ప్రశ్నగానే మిగిలిపోతోంది.
ఎలాగైనా ఏప ప్రభుత్వం వచ్చే మార్చి, ఏప్రిల్లో విశాఖకు తరలి వెళ్లాలని అనుకుంటోంది. జనవరి 31వ తేదీన హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తే వెంటనే… విశాఖకు వెళ్లిపోతారు. అలా ఇవ్వకపోతే.. సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చన్న కారణం చూపించి జగన్ వెళ్లిపోతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎలా అియనా తరలింపు ఆపలేరని అంటున్నారు. కానీ అలా చేయడం చట్టబద్ధం కాదని..జగన్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనన్న ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది.