ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ జీవోను 23వ తేదీ వరకూ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో నెంబర్ 1 విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 1పై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ ను ధర్మాసనం విచారణ జరిపింది. సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలను అడ్డుకోవటానికే ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఈ పిల్ దాఖలు చేయటంపై తమకు ఎటువంటి సమాచారం లేదని ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉన్నాయని.. వెకేషన్ బెంచ్ విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించిన పిటిషన్లపై విచారించవద్దని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ జీవో బ్రిటిష్ కాలం నాటి చట్టాల ఆధారంగా విడుదల చేశారు. ఇది చెల్లుబాటు కాదన్న వాదన న్యాయవర్గాల్లో ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రజల ప్రాణాలను కాపాడటానికి తీసుకొచ్చామని అడ్డగోలుగా వాదిస్తూ వస్తోంది. సంబంధం లేని వాళ్లతో వివరణ ఇప్పించింది. ఇటీవల ఓ పోలీసు అధికారి కూడా దీనిపై మాట్లాడారు. కానీ ఆయన అనేక డౌట్స్ క్లారిఫై చేయలేకపోయారు. ఇక అంతే కాక యూనివర్శిటీల్లో వీసీలు కూడా ఈ జీవో చాలా మందిని చర్చలు పెడుతున్నారు. అసలు రాజ్యాంగ వ్యతిరేకంగా జీవో ఉంటే.. దాన్ని పై ఇలా ప్రచారం చేస్తూ మొండిగా పోతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు హైకోర్టులో షాక్ తగిలింది.