శ్రీకాకుళం జిల్లా రణ స్థలంలో జనసేన ఆధ్వర్యంలో జరిగిన యువశక్తి సభలో పవన్ కల్యాణ్ ఉగ్రరూపం చూపించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్జున్న ముఖ్యమంత్రి దగ్గర్నుంచి ప్రతి ఒక్కరికీ ఇచ్చి పడేశారు. ముఖ్యమంత్రి జగన్ పేరు ఆయన ఎత్తకుండానే.. కొత్త పేరు పెట్టారు. జగన్కు మూడు ముక్కుల ముఖ్యమంత్రి అని పేరు పెట్టి పదే పదే ఆ పేరుతో పిలిచారు. ఇది క్యాచీగా ఉండటంతో ఇక నుంచి జనసేన నేతలు ఇదే పే్రుతో పిలిచే అవకాశం ఉంది.
వ్యక్తిగత విమర్శలు చేస్తున్న అంబటి రాంబాబుకు డైరక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు పవన్. వ్యక్తిగతంగా విమర్శిస్తున్న అంబటి తన దగ్గరకు వచ్చి ఆ మాటలు అనాలన్నారు. చెప్పులతో బడితె పూజ జరగడం ఖాయమని హెచ్చరించారు. తనతో పాటు తన కుటుంబంపై విమర్శలు చేస్తున్న రోజూను గట్టిగానే విమర్శించారు. ఇక ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు కూడా ఎత్తలేదు. వెధవా.. నీ పేరు కూడా గుర్తు పెట్టుకుంటాం ఏంట్రా ? అని పవన్ ఎకసెక్కాలాడారు. వ్యక్తిగతంగా మాట్లాడాలంటే మూడు ముక్కల ముఖ్యమంత్రి స్కూల్ జీవితం దగ్గర నుంచి తెలుసని పవన్ హెచ్చరించారు.శీలవతి అనే గంజాయితో ఏపీ ఈ మధ్య ప్రపంచంలో ఫేమస్ అయింది.. ఈ గంజాయి తీసుకుని మన సంబరాల రాంబాబులాగా ఏదైనా మాట్లాడవచ్చన్నారు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే ఒరేయ్ నేను మీకు దేవుడిని రా.. కాళ్లకు దండం పెట్టుకోండని సలహా ఇచ్చారు.
సహాలిచ్చేవాడు సజ్జల అయితే రాష్ట్రం సర్వనాశనమేనన్నారు. చచ్చు తెలివి తేటలు సజ్జలకే ఉన్నాయని.. నా మీద ఇంటలిజెన్స్ పెట్టడం దండగని.. .. మీకేం కావాలో చెబుతానని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఏపీ నుంచి శిలావతి అనే గంజాయి రకం ప్రపంచంలో ఫేమస్ అయిందని.. దీన్ని తాగి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ నాన్ననే ఎదుర్కున్నానయ్యా… మూడుముక్కల ముఖ్యమంత్రీ.. పంచలూడదీసి కొడ్తా అని చెప్పానననారు. సంబరాల రాంబాబొకడున్నాడు..ముదురు ముఖమేసుకుని…అటిన్ రాజాలూ..రాణీలతో మాటలు పడేది ప్రజలకోసమేనననారు. తాము మాత్రమే బాగుండాలని వైసీపీ నేతలు అనుకుంటున్నారని.. న్ని కులాలూ బావుండాలిరా సన్నాసుల్లారా అని సుద్దులు చెప్పారు. ఖైదీ నెంబర్ 6093 నా గురించి మాట్లాడితే ఎట్లాఅని..డీజీపీ గారూ…. మీరు ఒక ఖైదీకి సెల్యూట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ప్రతి ఒక్కరిపై చాలా ఘాటుగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
పొత్తులపైనా పవన్ క్లారిటీ ఇచ్చారు. గౌరవం తగ్గకుండా ఉంటే కలిసి వెళతామని ప్రకటించారు. మీరు బలం ఇస్తే ఒంటరిగానే వెళ్తానన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ టెక్నికల్ గానే గెలిచిందని.. అందుకే ఈ సారి ఓట్లు చీలకూడదని అంటున్నానని ప్రకటించారు. హంసించేవాడు ఒక్కడే అయితే అందరూ కలిసి పోరాడాల్సిందేనని అందుకే ఓట్లు చీలకూడదని చెబుతున్నానన్నారు.