అమరావతిలో అసైన్డ్ భూములను మాజీ మంత్రి నారాయణ బినామీ పేర్లతో కొన్నారని జగన్ కుటుంబానికి చెందిన సాక్షి మీడియా మరోసారి పే్జీలకు పేజీైలు రాసుకొస్తోంది. ఇటీవలే నారాయణకు చెందిన కాలేజీలు నిర్వహించే సంస్థలో సోదాలు చేసి.. ఏదో కొత్తగా కనిపెట్టినట్లుగా ఇవి రాస్తున్నారు. అసలు నారాయణ కాలేజీలకు.. ఈ అసైన్డ్ భూముల లావాదేవీైలకు సంబంధం ఏమిటో మాత్రం ఈ కథనంలో ఎక్కడా లేదు. గత నాలుగేళ్ల నుంచి అసైన్డ్ వ్యవహారంలో చేస్తున్న ఆరోపణల్ని మళ్లీ సాక్షి మీడియాలో రాశారు. దీనికి ఓ ప్రాతిపదిక ఉండాలి కాబట్టి సీఐడీ సోదాలను చూపించారు. పోనీ ఇదైనా రూఢీగా చెప్పారా అంటే అదీ లేదు.
మొత్తం కథనం రాసి.. నారాయణ సంస్థల్లో జరిగిన సోదాల్లో కీలక ఆధారాలు లభించినట్లుగా సమాచారం అని చెప్పుకొచ్చారు. ఇక్కడే వారి దుష్ప్రచారం వ్యూహం బయట పడుతుంది. నిజానికి అవి తప్పుడు లావాదేవీలు అయితే తక్షణం చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా ప్రచారం చేయడం ఎందుకనేది అందరికీ వచ్చే డౌట్. గత నాలుగేళ్లుగా అదే పని చేస్తున్నారు. చెప్పిందే చెబుతున్నారు . న్యాయస్థానాలకు కనీస ఆధారాలు సమర్పించలేకపోయారు. చేసిన ఆరోపణలే చేస్తూ వస్తున్నారు. ఎక్కడ భూ లావాదేవీ జరిగినా అది నారా, నారాయణ బందువులు అని ఆరోపించడం కామన్ అయిపోయింది.
విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో విజయసాయిరెడ్డి కూతురు, అల్లుడు భూములు కొనుగోలు చేస్తే మాకేం సంబంధం అని తండ్రి అడ్డగోలుగా వాదిస్తారు. కానీ అసలు బీరకాయ పీచు చుట్టం లేకపోయినా.. బినామీలు అని ఆరోపించడం వైసీపీకే్ చెల్లింది. అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో ఇప్పటికే ఎన్నో విచారణలు చేశారు. కానీ ఇంత వరకూ అసలు నిరూపించలేకపోయారు. ఏదో చేద్దామని.. మళ్లీ కొత్తగా కథనాలు రాస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతీ విషయంలోనూ కుట్ర పూరితంగా కనీస ఆధారాలు లేకుండా… సీఐడీ చేస్తున్న వ్యవహారాలు ఇప్పటికే వివాదాస్పదయ్యాయి. అవన్నీ తేలిపోవడంతో ఇప్పుడు కొత్తగా తప్పుడు ప్రచారంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించినట్లుగా చెబుతున్నారు.