నిందితుడిగా సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్ త్వరలో బాధితుడిగా ఎన్ఐఏ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్‌పై విశాఖలో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణలో బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. నెలాఖరు నుంచి ఈ కేసులో విచారణ ప్రారంభించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించారు. ఈ కేసులో ఇంత వరకూ బాధితుడైన జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టేట్ మెంట్ తీసుకోలేదని ఎన్ఐఏపై .. శ్రీనివాస్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. అయితే తాము జగన్ స్టేట్ మెంట్ నమోదు చేశామని ఎన్ఐఏ లాయర్ కోర్టుకు తెలిపారు.. అయితే ఆ స్టేట్ మెంట్.. చార్జిషీటులో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడి స్టేట్ మెంట్ నమోదు చేయకుండా ఇతర సాక్షులను విచారిస్తే ఏం ప్రయోజనమని న్యాయమూర్తి ప్రశ్నించారు.
నెలాఖరు నుంచి రెగ్యులర్ విచారణను ప్రారంభిస్తున్నందున బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీంతో బాధితుడైన సీఎం జగన్ కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎన్ఐఏ కేసులు చాలా కఠినంగా ఉటాయి. అంత తేలికగా బెయిల్ కూడా దొరకదు. సీఎం జగన్ కూడా.. శ్రీనివాస్‌కు బెయిల్ ఇప్పించేందుకు సహకరించలేదు. కనీసం లేఖ కూడా రాయలేదు. బాధితుడైన జగన్ లేఖ రాస్తే… బెయిల్ ఇచ్చేందుకు ఆవకాశం ఉండేదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ఐఏ కోర్టు విచారణ కీలకం కానుంది.