దిల్ రాజు చాలా తెలివైన నిర్మాత. ఆయన లెక్కలు అంత సులువుగా చిక్కవు. చాలా ప్లానింగ్ తో వుంటారు. అయితే ఆయన ప్లానింగ్, లెక్కలు మాత్రం వారసుడు సినిమా విషయంలో దారుణంగా తప్పాయి. 110 కోట్లు పారితోషికం ఇచ్చి తమిళ హీరో విజయ్ తో వారిసు/ వారసుడు సినిమా చేశాడు. తమిళ వెర్సన్ ఆల్రెడీ విడుదల అయ్యింది. తెలుగు వెర్సన్ పై ఎవరికీ పెద్ద ఆసక్తి లేదు. దీనికి కారణం కూడా దిల్ రాజే. మొదటి నుండి ఈ సినిమా ప్లానింగ్ దెబ్బకొడుతూనే వచ్చింది. రిలీజ్ డేట్ కిందామీద పడింది.
తమిళ్ నుండి ఎవరూ ప్రమోషన్స్ కి రాలేదు. 110 కోట్లు ఇచ్చి హీరో పెట్టుకున్న దిల్ రాజు అతన్ని కనీసం ఒక ప్రెస్ మీట్ కి తీసుకురాలేకపోయారు. మొన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లని పెట్టుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ వేదికపై శరత్ కుమార్ ని పట్టుకొని.. మీరు ప్రమోషన్స్ కి డేట్స్ ఇస్తారా ? అని అడిగారు దిల్ రాజు. ఇన్నేళ కెరీర్ దిల్ రాజు ఇలా ఒక ఆర్టిస్ట్ ని బ్రతిమాలుకున్న సినిమా మరొకటి లేదు.
డబ్బింగ్ సినిమా విడుదల చేసినప్పుడు కూడా ఆయన బ్యానర్ అంటే ఒక బజ్ వుంటుంది. వారసుడుకి అదీ లేకుండా పోయింది. హీరో హీరోయిన్ ని పిలిచి ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ పెట్టుకోలేకపోయారు. విజయ్ స్వయంగా కాఫీ కలిపి ఇచ్చారు. ఒక హీరో ఇలా కాఫీ ఇవ్వడం నేను ఎప్పుడూ చూడలేదని విజయ్ ని ఆకాశానికి ఎత్తారు దిల్ రాజు. అలా ఎత్తే క్రమంలో ఆయన వాడిన ఇంగ్లీష్ బాష వైరల్ అయ్యింది కానీ విజయ్ మనసు కరగలేదు. విజయ్ ఇక రాడని అర్ధం చేసుకున్న దిల్ రాజు.. మరో ప్రచార అస్త్రం తీశారు. ”ఒక తెలుగు గుండె తమిళ నాడుకి వెళ్లి అక్కడ హిట్ కొట్టింది” ఇది దిల్ రాజు కొత్త స్లోగన్. విచిత్రం ఏమిటంటే.. ఈ స్లోగన్ వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు.