‘క్రాక్’ తో సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు వీరసింహారెడ్డితో ఒక వీరమాస్ సినిమా తీశాడు. ఈ సినిమా రిజల్ట్ మాట పక్కన పెడితే మాస్ స్టార్స్ ని గోపి గొప్పగా హ్యాండిల్ చేస్తాడనే పేరు అయితే వచ్చింది. ప్రేక్షకులు మరో బోయపాటి దొరికాడని మెచ్చుకుంటున్నారు. అయితే గోపి నెక్స్ట్ లైన్ ఏమిటనేది క్లారిటీ లేదు. కానీ ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. క్రాక్ తర్వాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కోసం రెండు కథలు రెడీ చేశాడట గోపి.
”క్రాక్ విడుదల ఇంకా కాలేదు. అప్పుడే మైత్రీ మేకర్స్ నాతో సినిమా ఫిక్స్ చేశారు. అప్పటి నా దగ్గర బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న రెండు కథలు వున్నాయి. బాలకృష్ణ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న కథ కూడా బావుంటుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. నేను ముందు నుండి చెబుతున్నాను. నాకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటే వీర అభిమానం. నేను వాళ్ళ ఫ్యాన్ ని ” అని చెప్పుకొచ్చాడు గోపి.
అయితే ఇప్పుడు పవన్ లైన్ పెద్దగా వుంది. దాదాపు మూడు సినిమాలు పూర్తి కావాలి. తర్వాతే మరో సినిమా. ఒకవేళ గోపి- పవన్ సినిమా ఓకే ఐతే మాత్రం ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లే.