ఓడిపోయింది చాలా చిన్న మ్యాచ్ కావొచ్చు.. కానీ ఈ ఓటమి ఫలితంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు సభ్యులకు వారి దేశంలో ఎలాంటి పరాభవ స్వాగతం ఉంటుందో వారందరికీ అనుభవమే. ప్రపంచకప్‌ను ఫైనల్లో మంటగలిపేసి వచ్చినా వారు ఊరుకుంటారేమో గానీ.. భారత్‌తో ఏ చిన్న మ్యాచ్‌ను చేజార్చినా.. ఆ దేశంలోని వెర్రి అభిమానులు సహించలేరు. అందుకే అక్కడ భారత్‌తో ఓడిపోయిన సందర్భాల్లో క్రికెటర్ల మీద దాడులు, వారి ఆస్తుల మీద విధ్వంసకాండలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పాపం… చాలాకాలం తర్వాత మిర్పూర్ వేదికగా భారత్‌తో టీ20 ఆడిన పాకిస్తాన్ మరో పరాజయం మూటగట్టుకుంది. ఈ ఓటమి దెబ్బకు తమ స్వదేశంలో మరిన్ని రాళ్లదెబ్బలు పడకుండా తప్పించుకోవడం ఎలాగా? అని ఇప్పుడు సాకులు వెతుక్కుంటున్నట్లుంది.
ప్రత్యేకించి సానియా భర్త షోయబ్ మాలిక్ కూడా ఇదే పనిలో ఉన్నారు. జట్టు గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ.. తాను అంతో ఇంతో రాణిస్తానని ఆయన మ్యాచ్‌కు ముందు అనుకున్నట్లుంది. అందుకే తన శ్రీమతి సానియా కూడా సంతోషించేలాగా.. ”తను మెరుగ్గా ఆడితే, భారత్ గెలిస్తే.. సానియా సంతోషిస్తుందని” చెప్పి ఒక ట్విస్టు ఇచ్చారు. కానీ ఘోరం ఏంటంటే.. ఆయన వ్యక్తిగతంగా కూడా దారుణంగా ఫెయిలయ్యాడు. దీంతో స్వదేశానికి వెళ్లాలంటే భయం పుడుతున్నట్లుంది.
తమ ఓటమికి మిర్పూర్ పిచ్ కారణం అంటూ షోయబ్ సాకులు వెతుకుతూ ఉండడం విశేషం. పిచ్‌ను అర్థం చేసుకోవడంలో ఆలస్యం అయిపోయిందని వ్యాఖ్యానిస్తున్నాడు. అయినా మిగిలిన మ్యాచ్‌లో బాగా ఆడుతాం అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. అయినా ఎన్ని మ్యాచ్‌ల్లో యిరగదీసినా భారత్‌తో ఓటమిని వారి దేశంలో ఎలా మర్చిపోతారు. అందుకే షోయబ్‌కు ఒక సలహా.. ఆయన ఇల్లరికం వచ్చేస్తే బెటర్.. ఇక్కడ ఎలాంటి దాడులూ ఉండవు. ప్రతిభను ప్రూవ్ చేసుకుంటే చాలు.. మనాళ్లు బహుశా రేపు మన దేశపు జట్టులో సభ్యత్వం ఇచ్చినా ఆశ్చర్యం లేదు.