వైసీపీ నేతల రాజకీయం భిన్నంగా ఉంటుంది. వారు చేసే పనులు తాము చేయడం లేదని.. అంతా విపక్షమే చేస్తుందని ఆరోపిస్తూ ఉంటారు. తాము మాత్రం అన్నీ మంచి పనులు చేస్తున్నామంటారు. తాజాగా… పవన్ పై వారు చేస్తున్న ఆరోపణల్లో ఓ అంశం మాత్రం ఇప్పుడు .. అది పవన్ చేసింది కాదు వైసీపీ చేసిందేనని.. బయట పడుతుందనే సరికి పవన్ పై తోస్తున్నారన్న ఆనుమానాలు వస్తున్నాయి. అదేమిటంటే.. బ్లాక్ మనీ హవాలా చేయడం.
పవన్ కల్యాణ్ దెబ్బకు వైసీపీ చిప్ దెబ్బ తిన్నదేమో కానీ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితికి వెళ్లిపోతున్నారు. యువశక్తి సభ ముగిసినప్పటి నుండి పవన్ కల్యాణ్ ను ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తున్న ఆ పార్టీ నేతలు.. సాయంత్రానికి ఓ విచిత్రమైన టాపిక్ ను తెరపైకి తెచ్చారు. పవన్ కల్యాణ్ రూ. 1600 కోట్ల హవాలామనీని పోలండ్‌కు తరలిస్తూ కేంద్రానికి చిక్కారని మంత్రి దాడిశెట్టి రాజా చెప్పుకొచ్చారు. ఇప్పుడు పనన్ జుట్టు కేంద్రం చేతిలో ఉందన్నారు.
దాడిశెట్టి రాజా మాటలు విని వైసీపీ వాళ్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పవన్ అంత డబ్బు హవాలా చేస్తూ దొరికితే.. టీడీపీతో ఎందుకు వెళ్తారని.. బీజేపీ చెప్పినట్లుగా వింటారు కదా అనే డౌట్ వైసీపీ కార్యకర్తలకు వస్తుంది. ఒక వేళ బీజేపీ చెప్పినట్లుగా పవన్ చేస్తూంటే.. వైసీపీ సంగతి చూడాలని బీజేపీ డిసైడయినట్లే కదా..అదే నిజం అయితే.. వైసీపీ కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్ కానీ ఉనికి చాటుకోవడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ పోలాండ్ ఏంది.. హవాలా ఏంది అనేది మంత్రి దాడిశెట్టి రాజానే గుట్టు విప్పాలని అంటున్నారు.
అధికారంలో ఉన్న వారి దగ్గరే హవాలా డబ్బు ఉంటుంది. పెద్ద ఎత్తున ఇసుక.. మద్యం దందాలను కేవలం క్యాష్ రూపంలో చేస్తున్న వైసీపీ నేతలు.. ఇలా హవాలా చేస్తూ దొరికి పోయి ఉంటారని.. దీన్ని పవన్ పై రద్దుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ. పదహారు వందల కోట్లు హవాలా చేసేంత వ్యాపారాలు లేదా అధికారం పవన్ వద్ద లేదు. కానీ ఏదో బురద పూయాలని లేదా.. మరో ఎదురుదాడి చేసే ఉద్దేసంతో వైసీపీ కొత్త వాదన వినిపిస్తోంది. కానీ అది రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.