ప్రతి ఏడాది జనవరిలో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు దావోస్‌లో జరుగుతుంది. దీనికి ఆ సదస్సు నిర్వాహకులు కొంత మంది యాక్టివ్ భాగస్వాములకు ఆహ్వానాలు పంపుతారు. చాలా మంది అక్కడ పెలివియన్స్ ఏర్పాటు చేసుకుని తమ దేశాలను..రాష్ట్రాలను ప్రమోట్ చేసుకుంటారు. సాధారణంగా అన్ని ప్రభుత్వాలకు ఆహ్వానం పంపుతారు. ఈ సారి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం పంపారు. ఈ ఏడాది సదస్సును ‘కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్’ అనే థీమ్‌పై నిర్వహిస్తున్నారు. కేటీఆర్‌కు దావోస్ సదస్సు చైర్మన్ ఆహ్వానం పంపారు. ‘తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో మీ నాయకత్వం ఎంతో కీలకమైంది’ అని డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే ఆహ్వానపత్రికలో ప్రశంసించారు.
దావోస్ నుంచి ఇలాంటి ఆహ్వానం గత ఏడాది ఏపీ ప్రభుత్వానికి అందింది. ఈ కారణంగా సీఎం జగన్ కూడా తన ప్రతినిధి బృందంతో దావోస్ వెళ్లారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించినట్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సారి దావోస్ కు ఏపీ నుంచి ప్రతినిధి బృందం వెళ్లడం లేదు. జగన్ కూడా వెల్లడం లేదు. ఆహ్వానం అందకపోవడం వల్లనే ఈ సారి స్విస్ కు ఏపీ నుంచి బృందం వెళ్లడం లేదన్న చర్చ జరుగుతోంది. ఎందుకు ఆహ్వానం పంపలేదన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.
ఒక వేళ ఆహ్వానం పంపకపోయినా… ప్రతినిధి బృందాన్ని పంపి.. తాము త్వరలో నిర్వహించబోయే పెట్టుబడుల సదస్సుకు ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు. విశాఖ సదస్సుకు పిలిచి ఏపీ గురించి వివరించి పెట్టుబడులు పెట్టేలా చేయవచ్చు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం అలాంటి పనులే చేయడం లేదు. పూర్తి గా వదిలేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతీ ఏడాది ప్రతినిధి బృందం వెళ్లేది. ఏపీని గొప్పగా ప్రమోట్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సెంటిమెంట్ దెబ్బతిన్నది.. దీంతో ఏపీ వైపు పెట్టుబడిదారులు చూడటం లేదు.