ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి.. మెరుగుపడటానికి ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు. కానీ ఏపీ గురించి మాత్రం చర్చిస్తారో లేదో క్లారిటీ లేదు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం.. ఓ నివేదికను సోము వీర్రాజు పార్టీ హైకమాండ్ కు సమర్పించారు. అన్ని రాష్ట్రాల బీజేపీ చీఫ్ లు అదే చేశారు. సోము వీర్రాజు కూడా ఇచ్చారు. అయితే ఏపీ నుంచి ఒక్క సోము వీర్రాజు మాత్రేమ హాజరయ్యారు. జాతీయ కార్యవర్గంలో పదవి ప్రకారం సోము వీర్రాజు సభ్యుడు.
ఆయన కాకుండా.. కన్నా లక్ష్మినారాయణకు పదవి ఉంది. ఆయన నేరుగా జాతీయకార్యవర్గానికి హాజరు కావొచ్చు.కానీ సోము వీర్రాజుతో కలిసి వెళ్లడం ఇష్టం లేక ఆయన ఊరుకున్నారు. తన మనవడికి పుట్టు వెంట్రుకలు తీపిస్తున్నానని కారణం చెప్పారు. అయితే జాతీయ కార్యవర్గసమావేశాలంటే కంటే..అదేమీ పెద్ద కార్యక్రమం కాదని.. కానీ ఆయన కావాలనే డుమ్మా కొట్టారని పార్టీ అగ్రనేతలకూ అర్థమయింది. సోము వీర్రాజు తాను ఇచ్చిన నేతలతో పార్టీ బలోపేతం కోసం పెద్ద స్థాయిలో ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకున్నట్లుగా తెలుస్తోంది.అయితే పార్టీ వాస్తవ పరిస్థితిని మాత్రం ఆయన తన నివేదికలో చెప్పి ఉండరని అంచనా వేస్తున్నారు.
నోటాను దాటని స్థితికి పార్టీ పడిపోయింది. ఇప్పుడు ఎలా బలోపేతం చేయాలన్నదానిపై ఆపార్టీ నేతలకు క్లారిటీ లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం పాటించాలన్నదానిపైనా స్పష్టత లేదు. దీంతో.. పార్టీ హైకమాండ్ అసలు ఏపీ గురించి లైట్ తీసుకుంటుందా ? లేకపోతే.. మళ్లీ గతంలోలా పొత్తులతో అధికారంలోకి వచ్చేశామనే లెక్కలు వేసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికైతే.. ఏపీ నుంచి కార్యవర్గ సమావేశం మొత్తం మీద ఒక్కరంటే ఒక్కరే అదీసోము వీర్రాజు మాత్రమే హాజరయ్యారంటే… అసలు బీజేపీ ఏపీని పట్టించుకోనట్లేనని అనుకోవచ్చు.