శ్రీకాకుళంలో వైసీపీ సీనియర్ నేతలు తాము పోటీ చేయలేమని హైకమాండ్ కు చెబుతున్నారు. అయితే టిక్కెట్ మాత్రం తమ కుమారులకే ఇవ్వాలంటున్నారు. కానీ జగన్ మాత్రం మీ కుమారులు గెలిచే పరిస్థితి లేదు .. సీనియర్లు పోటీ చేస్తానంటే మీకే ఇస్తా లేకపోతే వేరే వారికి ఇస్తానని చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో ముగ్గురు సీనియర్లు పరిస్థితిని మార్చి ఎలాగైనా కుమారులకు టిక్కెట్లు ఇప్పించుకోవాలనుకుంటున్నారు.
మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు చాలా సార్లు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. దానికి కారణం తన కుమారుడు కృష్ణచైతన్యకు టిక్కెట్ ఇవ్వమని కోరడమే. ప్రస్తుతం ఆయన జడ్పీటీసీగా ఉన్నారు. మరో వైపు తమ్ముడు ధర్మాన ప్రసాదరావు కూడా తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడ్నిని తెరపైకి తెస్తున్నారు. జగన్ కు చెప్పానని కానీ తననే పోటీ చేయమని అంటున్నారని ఆయన వాపోతున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ధర్మాన సోదరులిద్దరికీ రాజకీయంగా ఒకరంటే ఒకరికి పడటం లేదు.
స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఆముదాల వలస నుంచ ితనకు వవద్దని.. తన కుమారుడు చిరంజీవి నాగ్ కు చాన్సివ్వాలని కోరుతున్నాు. కానీ వ్యతిరేక వర్గీయులు సీతారాం నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎ ఒక్క వారసులకీ చాన్సివ్వడం లేదని.. మళ్లీ అందరు సీనియర్లే పోటీ చేయాలని అంటున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా అనుభవ లేని వారికి చాన్సిచ్చి రిస్క్ తీసుకోలేమని ఆయన అనుకుంటున్నట్లుగా వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఓడిపోతారని తెలిస్తే సీనియర్లకూ ఝులక్ ఇస్తారని అంటున్నారు.