పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ లేదా బహిరంగసభ పెడితే.. అలా ముగియగానే ఇలా కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ పెద్దలు ఓ గ్యాంగ్ రెడీ చేసి ఉంచుతారు. పవన్ కాస్త ఘాటుగా మాట్లాడితే వారంతా రెండు రోజుల పాటు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి వారు విమర్శలు అనుకునే తిట్లను ప్రవహింప చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణే కాదు.. వాళ్లని హైపర్ ఆది కూడా భయపెడుతున్నాడు. జబర్దస్త్ ద్వారా కాస్త గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ హైపర్ ఆది .. మొదటి నుంచి నాగబాబు క్యాంప్ లో ఉన్నారు. పవన్ అభిమాని.సహజంగానే జనసేన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఇటీవల యువశక్త సభలో ఆయన చేసిన ప్రసంగం పంచ్లతో సాగింది. అయితే అది జబర్దస్త్ వేదిక కాదు. రాజకీయం. అందుకే ఆయన మాటలు .. పంచులు రాజకీయ విమర్శలే. అయితే వైసీపీ నేతలు మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. హైపర్ ఆదిపై.. రోజా దగ్గర్నుంచి .. బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి వరకూ అందరూ స్పందిస్తున్నారు. ఆయన ను చేస్తామంమటూ హడావుడి చేస్తున్నారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సోషల్ మీడియా టీం నిర్వహించే ఓ పేజీలో హైపర్ ఆది ఫోన్ నెంబర్ ఇచ్చి.. కాల్ చేసి తిట్టమని అందరికీ పిలుపునిచ్చారు.
వైసీపీ నేతలు చాలా మంది హైపర్ ఆదిపై స్పందిస్తున్నారు. అసలు హైపర్ ఆదికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో.. జబర్దస్త్ కమెడియన్ ను చూసి ఎందుకంత కంగారు పడుతున్నారో.. వైసీపీ క్యాడర్ కే అర్థం కావడం లేదు. ఇలాంటి వాళ్లందర్నీ.. రాజకీయ నేతల్ని చేయడానికి తమ నేతలే కంకణం కట్టుకున్నారని.. వైసీపీ కార్యకర్తలు.. సెటైర్లు వేసుకుంటున్నారు.