విశాఖ ఉక్కునే కాదు విజయవాడ ఎయిర్ పోర్టును కూడా కేంద్రం అమ్మకానికి పెడుతోంది. వచ్చే బడ్జెట్లో అమ్మబోయే విమానాశ్రయాల జాబితాను కేంద్రం ప్రకటించనుంది జాతీయ మీడియా ప్రకటిస్తోంది. ఈ డాబిాతలో విజయవాడ విమాశ్రయం పేరు కూడా ఉంది. విమానయాన రంగంలో ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రూ.8,000 కోట్లు రాబట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించడం అంటే… కొత్త విమాశ్రయాలను కట్టడం కాదు.. పాత వాటిని అమ్మేయడం.
ప్రయివేటీకరణకు వీలుగా 11-12 విమానాశ్రయాల జాబితాను రూపొందించారు. ఇందులో విజయవాడ, రారుపూర్, జైపూర్, కోల్కత్తా, ఇండోర్ తదితర కీలక విమానాశ్రయాలు ఉన్నాయి. దీనిపై ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే 2023-24 బడ్జెట్లో ప్రకటన చేయగానే.. తదుపరి ఆమోదానికి పంపించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం దేశంలో 146 విమానాశ్రయాలున్నాయి. వీటిని వచ్చే కొన్ని ఏళ్లలో 200 చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ వాటికి పెట్టుబడులను ఆకర్షించడం లేదు. ఉన్న వాటిని అమ్మేస్తోంది.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని మరిన్ని విమానాశ్రయాల ప్రయివేటీకరణ ప్రక్రియ కొనసాగనుంది. విజయవాడ ఎయిర్ పోర్టు ఏపీకి ఉన్న ప్రధాన ఎయిర్ పోర్టు. విశాఖలో ఉన్న ఎయిర్ పోర్టు .. వైమానిక దశానికి సంబంధించినది. విశాఖ కు దగ్గరగా బోగాపురం ఎయిర్ పోర్టును నిర్మించాల్సి ఉన్నప్పటికీ.. గత ఎనిమిదేళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.