బీఆర్ఎస్ ఆవిర్భావ సభ రోజే ఆ పార్టీకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి షాకిస్తాడని.. ఢిల్లీకి పోయి అమిత్ షాతో భేటీ అవుతారని .. బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పొంగులేటి కూడా.. ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు. కానీ ఆయన మాత్రం బీఆర్ఎస్కు దూరమయ్యారు. ఆవిర్భావ సభలో ఆయన వర్గం పాల్గొనలేదు. ఇప్పుడు పొంగులేటి ఖచ్చితంగా పార్టీ మారాల్సిందే. కానీ ఏ పార్టీ అన్నది ఆయన తేల్చుకోలేకపోతున్నారు. బీజేపలో చేరితే భవిష్యత్ భయం.. కాంగ్రెస్లో చేరితే.. దర్యాప్తు సంస్థల భయం ఆయనను వెంటాడుతున్నాయి.
ఖమ్మంలో బీజేపీకి కనీస ఉనికి లేదు. లీడర్ లేరు.. క్యాడర్ లేరు. ఒక వేళ పొంగులేటి బీజేపీలో చేరితే ఆయనే నేత అవుతారు. ఆయన వర్గమే బీజేపీ వర్గం అవుతుంది. కానీ ఎన్నికల్లో దాంతోనే గెలవొచ్చా అంటే చెప్పడం కష్టం. కానీ కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం మొత్తం కమిట్ మెంట్ ఉన్న క్యాడర్ ఉన్నారు. ఆ పార్టీలో చేరితే గెలుపు దిశగా సాగవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వచ్చాయి. తమ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైలమాలో పడిపోయారని అంటున్నారు.
అమిత్ షా ఈ నెల 28వ తేదీన తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆయన అసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఆ సమయంలో పొంగులేటి డిసైడ్ చేసుకుంటే బీజేపీలో చేరే చాన్సుంది.త లేదంటే.. ప్రధాని మోదీ ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ లో పర్యటిస్తారు. అప్పుడైనా చేరవచ్చు.ఈ రెండు సందర్భాల్లోనూ పొంగులేటి బీజేపీలో చేరలేదంటే..ఆయన ఇక కాంగ్రెస్ పార్టీనే బెటరని అనుకుంటున్నట్లుగా తేలిపోతుంది. కానీ.. బడా కాంట్రాక్టర్ అయిన ఆయనకు .. బీజేపీ తప్ప మరో చాయిస్ఉండదని.. ఎక్కువ మంది నమ్ముతున్నారు.