సినిమా జయాపజయాల్లో నిడివి ప్రాధాన్యం కూడా ఉంటుంది. సినిమా ఎంత బాగున్నా… లెంగ్త్‌లో ఇబ్బంది వస్తే కొన్ని సన్నివేశాల్ని కత్తిరించక తప్పదు. అందుకే ఏ సినిమా చూసుకొన్నా… రెండో, మూడో సన్నివేశాల్ని పక్కన పెట్టేస్తుంటారు. ఈమధ్య `ధమాకా` విడుదలైంది. రవితేజ కెరీర్‌కి బూస్టప్ ఇచ్చిన సినిమా ఇది. ఇందులోనూ డిలీట్ చేసిన సీన్లు ఉన్నాయి. అవన్నీ ఒకొక్కటిగా ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకూ 7 డిలీట్ సీన్లు బయటకు వచ్చాయి. ఇంకెన్ని దాచి పెట్టారో తెలీదు. వాటి నిడివి దాదాపుగా 15 నిమిషాల వరకూ ఉంటుంది. అందులో కొన్ని బిట్లు బాగున్నాయి కూడా. ఓ సన్నివేశంలో దర్శకుడు నక్కిన త్రినాథరావు కూడా కనిపించాడు. ఆ సినిమాలో అలీ ఉన్నా… తనకు కేవలం రెండు మూడు డైలాగులే ఇచ్చారు. ఎందుకంటే మిగిలిన సీన్లన్నీ… ఎడిటింగ్ కత్తెరకు బలైపోయాయి. అందుకే అలీ పాత్రకు ఏ మాత్రం ప్రాధాన్యం లేనట్టు కనిపించింది. కేవలం నిడివిని దృష్టిలో ఉంచుకొని ఆయా సీన్లు పక్కన పెట్టేశారు. ధమాకా నిడివి ఇప్పటికే రెండున్నర గంటలుంది. ఇది కూడా కలుపుకొంటే.. 2 గంటల 45 నిమిషాల ఫుటేజీ వద్దును. సినిమాని అంత సేపు చూసే ఓపిక ఈనాటి ప్రేక్షకుడికి లేదు. అందుకే.. ఆయా సన్నివేశాల్ని పక్కన పెట్టారు. అవన్నీ ఈ సినిమాలో ఉండి ఉంటే.. ఫలితం కూడా తేడా కొట్టేసేదేమో..?