రవితేజ `డాన్ శీను`గా వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర డీసెంట్ హిట్ అందుకొంది. నిజానికి ఈ కథ.. ముందు ప్రభాస్ విన్నాడు. నచ్చింది కూడా. `కథ రెడీ చేయ్.. చేసేద్దాం` అని మాట ఇచ్చాడు. కానీ ఆ వెంటనే `ఏక్ నిరంజన్` మొదలైపోయింది. ప్రభాస్ కాల్షీట్లు దొరకడానికి ఇంకొన్నాళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి. అందుకే… రవితేజకు వినిపించి, ఓకే చేయించేసుకొన్నాడు గోపీచంద్. మధ్యలో హీరో గోపీచంద్ కూడా ఈ సినిమా చేద్దామని ముచ్చట పడ్డాడు. కానీ చివరికి రవితేజ చేతుల్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని గోపీచంద్ మలినేని గుర్తు చేసుకొన్నాడు. `వీరసింహారెడ్డి` హిట్ అవ్వడంతో… ఇప్పుడు మరో సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. గోపీచంద్ దగ్గర రెండు కథలు రెడీగా ఉన్నాయి. ఒకటి పవన్ కల్యాణ్‌కి టేటర్ మేడ్ కథ. ఇంకొకటి.. థ్రిల్లర్. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ కాల్షీట్లు దొరకడం కష్టం కాబట్టి… థ్రిల్లర్ సబ్జెక్ట్ తోనే ముందుకెళ్లే అవకాశం ఉంది. మార్చిలో ఈ సినిమా విషయాలు తెలుస్తాయి.