ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ప ేరును వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ యూనివర్శిటీ అని మార్చడమే వైస్ చాన్సలర్ గా కూడా… రాధికారెడ్డిని నియమించారు. ఆమె మూడేళ్ల పాటు పదవిలో ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు. ఈ రాధికారెడ్డి ఎవరో కాదు.. వైసీపీ నేత జగన్.. నలుగురు రెడ్లకు రాష్ట్రాన్ని పంచారని విపక్షాలు ఆరోపిస్తూంటాయి. ఆ నలుగురు … సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఈ నలుగులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమీప బంధువు. పూర్తి పేరు వేమిరెడ్డి రాధికారెడ్డి. ప్రస్తుతం డైరక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో జేడీగా పని చేస్తున్నారు.
ప్రస్తుతం వీసిగా ఉన్న శ్యామ్ ప్రసాద్ దళిత వర్గానికి చెందిన వారు. ఆయన మరోసారి పొడిగింపు ఇవ్వాలని చాలా సార్లు ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకున్నారు. ఆయన ప్రభుత్వం చెప్పినట్లుగా చేశారు. ఎన్నో సార్లు జగన్ ను విపరీతంగా పొడిగారు. ఆరోగ్య వర్శిటీ నిధులను ప్రభుత్వానికి మళ్లించారు. అంతే కాదు.. మళ్లీ జగనే గెలుస్తారంటూ.. ఆయన జోస్యం కూడా చెప్పారు. ఇంత చేసి ఆయన చెడ్డ పేరు మూటగట్టుకున్నారు కానీ ఆయనకు పదవి పొడిగింపు లభించలేదు. ఈ పదవి కోసం మంత్రి ఆదిమూలపు సురేష్ సమీప బంధువు బాబ్జి ప్రయత్నించారు. కానీ రెడ్డి నాయకుడికే ప్రాధాన్యం లభించింది.
వైసీపీలోనే కాదు ప్రభుత్వంలో ఇలా పదవులన్నీ.. తమ వర్గానికి ఇప్పించుకుంటున్నారని.. ఇతర వర్గాలను దారుమంగా వంచిస్తున్నారని ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాను చేయాలనుకున్నది చేస్తోంది. అయితే ప్రచారం మాత్రం తాము బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అత్యధిక పదవులు ఇచ్చామని చేసుకుంటూ ఉంటాయి. ఆయా వర్గాల్లో అసహనం పెరుగుతున్నా… ప్రభుత్వం మత్రం ఓట్లు మాకు కాకపోతే ఎవరికి వేస్తారన్న దీమాతో … తన వర్గానికి ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వెళ్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.