ఏపీ ఉద్యోగులకు ఎప్పుడూ లేనంత కష్టం వచ్చి పడింది. పొరుగు రాష్ట్ర ఉద్యోగులకు ఠంచన్ గా డీఏలు, బకాయిలు చెల్లిస్తూంటే… ఏపీలో మాత్రం అవి అడిగినందుకు నోటీసులు వచ్చి పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగులకు రెండు శాతానికిపైగా డీఎ ప్రకటించింది. దీంతో మొత్తం కరువు భత్యం ఇరవై శాతానికి దాటిపోయింది. ఏపీ ఉద్యోగులకు మాత్రం డీఏలు అడిగారని నోటీసులు పంపుతున్నారు.
గతంలో ఆరేడు డీఏలు పెండింగ్లో ఉంటే.. పీఆర్సీతో కలిపి మ్యాజిక్ చేశారు. ఉద్యోగ సంఘ నేతలను గ్రిప్ లో పెట్టుకుని పని పూర్తి చేశారు. మళ్లీ డీఏలు అడుగుతూంటే మాత్రం స్పందించండం లేదు. గత జనవరిలో డీఏ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది …కానీ ప్రకటించలేదు. తమకు రావాల్సిన డీఏలు ఇవ్వడం లేదని బకాయిలు వాడేసుకున్నారని.. గవర్నర్ కు ఫిర్యాదు చేస్తే.. .. ఆ ఉద్యోగ సంఘం గుర్తింపు రద్దు చేయడానికి నోటీసులు ఇచ్చారు. వారం తర్వాత ఆ ఉద్యోగ సంఘం ఉనికి కిష్టమే.
తర్వాత నోరు జాడిస్తే ఇతర ఉద్యోగ సంఘాలకూ అదే గతి పట్టిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు పంపడానికేనా.. ఈ పని చేస్తుంది. విచిత్రం ఏమిటంటే ఇప్పటికీ ఉద్యోగ సంఘం నేతలు… ప్రభుత్వానికే అనుకూలంగా ఉంటున్నారు తమ సంక్షేమం కోసం పోరాడామని నేతలుగా ఎన్నుకుంటే.. వారు ఇలా స్వార్థంతో … ప్రభుత్వానికి బాకా ఊదడంతో.. తాము మోసపోతున్నామని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అంతకు మించి వారు చేయడానికి కూడా ఏమీ లేకుండా పోయింది.