ఏపీలో ఓ కేంద్ర మంత్రి పర్యటిస్తున్నారు. కేంద్రం నిధులతో కట్టిన .. కట్టిస్తున్న అభివృద్ధి పనుల వద్దకు వెళ్తున్నారు. అయితే ఒక్క చోట ఆమెకు అది కేంద్ర నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులు అనే సూచికలే కనిపించలేదు. ఒక్క చోట మోదీ ఫోటో లేదు. పైగా.. మొత్తం వైసీపీ రంగులతో నిండిపోయి ఉన్నాయి. నలుగుదిక్కులా జగన్ బొమ్ముల ఉన్నాయి. దాంతో ఆ కేంద్ర మంత్రికి ఇరిటేషన్ వచ్చింది. వాటీజ్ దిస్ అని ప్రశ్నించింది. కానీ ఎవరూ నోరు మెదపలేదు.
ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన లో భాగంగా విజయవాడ శివారులో నిర్మించిన ఆస్పత్రిని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పరిశీలించారు. లోపలికి వెళ్తూంటే తాను వైసీపీ ఆఫీసులోకి వెళ్తున్న పీలింగ్ కలగడంతో ఆమెఫీలయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను అందుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ లోగోనుగానీ, ప్రధాని మోదీ ఫొటోలను ప్రదర్శించకపోవడం ఏంటని ప్రశ్నించారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ నుంచి అధికారుల బృందం వచ్చి విచారణ చేస్తారని.. షోకాజ్ నోటీసు కూడా జారీ చేస్తామని హెచ్చరించారు.
అయితే పాపం కేంద్రమంత్రికి తెలియనిదేమిటంటే.. ఎన్నో పథకాలకు ఇలాగే చేస్తున్నా ఇంతవరకూ ఎవరూఒక్క మాట అనలేదు.. ఇక ముందు అనకపోవచ్చు కూడా.. కేంద్రంతో తమకు అంత అండర్ స్టాండింగ్ ఉన్న విషయం కేంద్ర మంత్రికి తెలియదని వైసీపీ నేతలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. చాలా కాలంగా జీవీఎల్, సోము వీర్రాజులాంటి వాళ్లు అదే చెబుతూంటారు. కానీ చర్యలు లేవు. అందుకే.. ఏపీ పర్యటనకు వచ్చే కేంద్రమంత్రులు ఎంత సీరియస్ అయినా అది ఆ ఒక్క రోజుకే.