ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సొంతగడ్డపై విజయాల మీద విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా.. న్యూజిలాండ్‌నూ క్లీన్ స్వీప్ చేసేసింది. కొన్ని రోజుల కిందటే శ్రీలంకపై వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. కివీస్ మీదా అదే ప్రదర్శనను పునరావృతం చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
భారత్ నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 41.2 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని టీమ్ఇండియా 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. కివీస్ బ్యాటర్లలో డేవాన్ కాన్వే (138 ).. నికోల్స్ (42), మిచెల్ శాంటర్న్ (34) రాణించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో మెరవగా.. చాహల్ రెండు, హార్దిక్ పాండ్య, ఉమ్రాన్ మాలిక్ ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్… ఓపెనర్లు రోహిత్ శర్మ (101) శుభ్‌మన్ గిల్ (112 ) శతకాలతో రాణించగా హార్దిక్ పాండ్య (54) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ చేసిన శుభ్‌మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఎన్నాళ్ళుగానో ఊరిస్తున్న వన్డే ర్యాంకింగ్ లో అగ్రస్థానం మన సొంతమైయింది. 114 రేటింగ్స్ తో ఇంగ్లాండ్ ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి చేరింది టీమిండియా.