సుధీర్ బాబు సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి. వాటిపై ఆయన ప్రత్యేక శ్రర్ధ చూపిస్తుంటాడు. హంట్ సినిమా లో కూడా యాక్షన్ కి పెద్ద పీట వేశారు. ట్రైలర్, మేకింగ్ వీడియో లలో అవే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఫైట్స్ విదేశాల్లో తెరకెక్కించారు. సాధారణం గా పోరాట ఘట్టాలు తెరకెక్కించడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఒకొక్క ఫైట్ కి కనీసం 5,6 రోజుల సమయం పడుతుంది. కానీ ఈ సినిమాలో ఉన్న 4 ఫైట్స్ కేవలం 4 రోజుల్లోనే తీసేసారట. ఈ యాక్షన్ సీక్వెన్సుల గురించి సుధీర్ బాబు తన అనుభవాలని పంచుకున్నాడు.
ఫారిన్ స్టంట్ మాస్టర్లతో ఫైట్ తీయడం అంత సులభంగా జరగలేదని సుధీర్ బాబు చెప్పాడు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళను తాను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాని, ఓ యాక్షన్ సినిమాకు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలని భావించినట్టు తెలిపాడు. ‘జాన్ విక్ 4’ సహా కొన్ని సినిమాలకు వర్క్ చేస్తున్నారని తెలుసుకుని కాంటాక్ట్ అయితే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వచ్చిందన్నాడు. తీరా మాట్లాడిన తర్వాత డబ్బులు ముందు ట్రాన్స్ఫర్ చేయమని అడిగితే అలాగే చేశామన్నాడు. మొదట 12 రోజులు షూటింగ్ అనుకున్నా, రెండు రోజులు రిహార్సిల్స్ చేసి నాలుగు రోజుల్లో ఫైట్స్ షూట్ అంతా కంప్లీట్ చేశామన్నాడు. ఇక్కడ ఎవరికైనా చూపించి నాలుగు రోజుల్లో తీశామంటే నమ్మరని చెప్పాడు. అంత బాగా వచ్చాయన్నాడు.
‘హంట్’లో యాక్షన్ కంటే ఎమోషన్ ఎక్కువ హైలైట్ అవుతుందన్న సుధీర్ బాబు, క్యారెక్టర్ పరంగా ప్రయోగం చేశామన్నాడు. పేపర్ మీద ఉన్నప్పుడు రిస్క్ అని ఫీల్ కావచ్చని… కానీ తాను సినిమా చూశానని, హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాడు. భవ్య క్రియేషన్స్ బ్యాకెండ్ ఉండటంతో కంట్రోల్డ్ బడ్జెట్ లో, చాలా నమ్మకంగా సినిమా చేశామన్నాడు.
ప్రేక్షకులు తనను అటువంటి క్యారెక్టర్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారోనని చిన్న టెన్షన్ ఉందని సుధీర్ బాబు చెప్పాడు. ప్రతి హీరో ఇటువంటి కథలు చేయరని, తాను డేర్ చేశానని తెలిపాడు. ఎవరిని ‘హంట్’ చేస్తున్నదీ చెప్పలేదు. ప్రేక్షకుడు కూడా తన పాత్రతో ట్రావెల్ చేస్తూ తెలుసుకుంటాడని వివరించాడు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.