ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజునే కొనసాగించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సందేశం పంపించారు. ఈ మేరకు కార్యవర్గ సమావేశానికి హాజరైన నేతలందరూ ఆయనను అభినందించారు. కానీ వచ్చిన వాళ్లంతా బీజేపీలో ఉండే వైసీపీ సపోర్టర్లు. ఆయన నాయకత్వం అంగీకరించని ముఖ్య నేతలెవరూ హాజరు కాలేదు. సత్యకుమార్, పురందేశ్వరి, కన్నా., సుజనా ఇలా ఎవరూ రాలేదు. దీంతో బీజేపీలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది.
సోము వీర్రాజు పార్టీని వైసీపీకి తాకట్టు పెట్టేశారంటూ… ఓ వైపు కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సమయమంలోనే ఆ పార్టీకి రాజీనామాలు చేయడం ప్రారంభించారు. కన్నా ఒకప్పుడు సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ఉన్న పెదకూరపాడు నుంచి బీజేపీ నేతలంతా రాజీనామాలు చేశారు. ఆయన మద్దతుదారులంతా మెల్లగా బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారు. మిగిలిన వారు పార్టీలో యాక్టివ్ కావడం కష్టం. కానీ సోము వీర్రాజు మాత్రం ఎవరూ లేకపోయినా పర్వాలేదని దిలాసాగా ఉన్నారు. ఆయన లక్ష్యం వేరని.. అయినా హైకమాండ్ ఎందుకు ప్రోత్సహిస్తుందోనని.. మిగిలిన వారు చర్చించుకుంటున్నారు.
ఒకప్పుడు ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతున్న సమయంలో కన్నాను బీజేపీ హైకమాండ్ తొలగించి… సోము వీర్రాజుకు పదవి ఇచ్చింది. అప్పట్నుంచి బీజేపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ప్రభుత్వపై పోరాటం అనేదే లేకుండా పోయింది. దీంతో వైసీపీకి అనుబంధం అని ముద్రపడిపోయింది. ఢిల్లీ రాజకీయాల కోసం ఇలా చేశారా అన్నదానిపై స్ఫష్టత లేదు. అప్పట్లో కన్నాను తీసేస్తారని.. విజయసాయిరెడ్డి చెప్పేవారు. అన్నట్లుగానే జరిగింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.