గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏటా కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారిని అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులని ప్రకటిచింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం.. వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి.
తెలంగాణ నుంచి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వారిలో మోదడుగు విజయ్ గుప్తా, హనుమంతరావు పసుపులేటి, బి.రామకృష్ణారెడ్డి ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ సంగీత దర్శకుడు కీరవాణి, గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావు, సీవీ రాజు, కోట సచ్చిదానంద శాస్త్రి , సంకురాత్రి చంద్రశేఖర్, ప్రకాశ్ చంద్రసూద్ లను పద్మశ్రీ వరించింది.
వీరితో పాటు ఓఆర్ఎస్ సృష్టికర్త దిలీప్ మహలనబిస్కు వైద్యరంగంలో మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రముఖ గాయని వాణి జయరాం కు తమిళనాడు నుంచి పద్మభూషణ్ అవార్డ్ కు ఎంపికయ్యారు. అలాగే తెలంగాణ నుంచి ఆధ్యాత్మిక వేత్త చినజీయర్ స్వామి, కమలేశ్ డి పటేల్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు.