అదానీ … ప్రపంచంలో అత్యంత కుబేరునిగా ఎదగడానికి ఎలా గాలి మేడలు కట్టారో.. ఆ గాలి మేడల్ని తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి ఎలా ప్రజా ధనాన్ని రుణాలుగా తీసుకున్నా హిండెన్‌బర్గ్ స్పష్టంగా వెల్లడించింది. నిజానికి ఇదంతా బహిరంగ రహస్యం. ఇండియాలో మార్కెట్ పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ కంపెనీ షేర్లు గాలి బుడగలేనని…. ఎప్పుడైనా పేలిపోవచ్చని అనుకుంటూనే ఉన్నారు. కానీ కేంద్రంలో బీజేపీ సపోర్ట్ ఉన్నంత వరకూ అదానీకేమీ కాదని అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది.
అదానీ కంపెనీల గురించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చెప్పిన వివరాలు నిజం కాదని వాదించే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. ఇప్పుడు అవి తప్పు అని అమెరికా లేదా ఇండియా కోర్టుల్లో దావా వేస్తే.. అసలు నిజం ఏమిటో చెప్పాల్సి ఉంటుంది. అదానీ అంత ధైర్యం చేయడం కష్టం. ఎందుకంటే.. అదానీ కంపెనీల గురించి అందరికీ తెలుసు. గతంలోనూ టాక్స్ హెవెన్ కంట్రీస్ నుంచి.. లెక్కా పత్రం లేకుండా వేల కోట్లు తెచ్చినట్లుగా తేలింది. ఆ కేసును సెబీ ఏం చేసిందో ఇంత వరకూ తెలియదు.
అదానీ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలితే అంతకు మించిన దౌర్భాగ్యం ఉండదు. ఇప్పటికే ఎల్ఐసీ సొమ్ము పదహారు వేల కోట్లు హరించుకుపోయిందని చెబుతున్నారు.. అదానీ షేర్లను తనఖా పెట్టుకున్న బ్యాంకులు మరింత మునిగిపోతాయి. అదానీ కంపెనీలు నేరుగా చేసే వ్యాపారం చేలా పరిమితం.. వాటి వాస్తవ విలువకు..షేర్ విలువకూ పొంతన ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టకోపేత.. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది.
ఆదానీ పై విచారణ చేయాలని.. ఇండియాలో డిమండ్లు కూడా పెద్దగా వినిపించడం లేదు. అది అదానీకి ఉన్న పొలిటికల్ పవర్ కావొచ్చు. కానీ ఆ సంస్థ మునిగిపోతే… నష్టపోయేది మాత్రం అదానీ మాత్రమే..కాదు దేశం కూడా. ఎందుకంటే అదానీ వ్యాపారం చేస్తోంది.. దేశ ప్రజల సంపదతోనే !