బోయపాటి స్ట్రాటజీలు కాస్త భిన్నంగా ఉంటాయి. అప్పటి వరకూ లేని ఇమేజ్‌ని తన సినిమాతో.. తీసుకురావడానికి ప్రయత్నిస్తారు బోయపాటి. లెజెండ్ లో బాలకృష్ణ, అఖండలో శ్రీకాంత్‌ల ఇమేజ్‌లను పూర్తిగా మార్చేశారాయన. ఇప్పుడు రామ్ సినిమాకీ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.
రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో… ప్రిన్స్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చిన్న సినిమాల్లో హీరోగా మెరిశాడు ప్రిన్స్. టాలెంట్ ఉంది కానీ, ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు. ఇప్పుడు రామ్ సినిమాలో తను ఓ కీ రోల్ చేస్తున్నాడు. ఇందులో ప్రిన్స్ గెటప్, క్యారెక్టరైజేషన్‌ని ఓ రేంజ్లో మార్చేశాడట బోయపాటి. ప్రిన్స్ ని తెరపై చూస్తే ఒళ్లు గగుర్పాటుకి గురయ్యేలా ఆ పాత్రని డిజైన్ చేశాడట. ఈ సినిమా గనుక హిట్టయితే… ఇండస్ట్రీకి మరో విలన్ దొరికేసినట్టే అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి… ప్రిన్స్‌కి ఈ సినిమాతో ఎలాంటి బ్రేక్ వస్తుందో చూడాలి.