పఠాన్‌తో ఓ సూపర్ హిట్టు కొట్టాడు సిద్దార్థ్ ఆనంద్. ఈ హిట్టు బాలీవుడ్ కి బూస్టప్ ఇచ్చింది. రికార్డు వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్ లోని బడా హీరోల దృష్టి సిద్దార్థ్ ఆనంద్ పై పడింది. అయితే.. సిద్దార్థ్ మాత్రం ప్రభాస్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. పఠాన్ కంటే ముందు సిద్దార్థ్ ఆనంద్ – ప్రభాస్ ల మధ్య భేటీ జరిగింది. ప్రభాస్ కూడా సిద్దార్థ్ తో పని చేయడానికి సంసిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే.. `పఠాన్` రిజల్ట్ కోసం ఎదురు చూశాడు. ఇప్పుడు ఆ రిజల్ట్ వచ్చేసింది. సో.. ప్రభాస్ తో సిద్దార్థ్ తో పనిచేయడానికి ఎలాంటి అభ్యంతరాలూ లేవు. ఈ కాంబోలో మైత్రీ మూవీస్ ఓ సినిమా చేయబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇప్పుడు దానికి కూడా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసింది.
మైత్రీ నిర్మాతలు ఈ రోజు సిద్దార్థ్ ఆనంద్‌ని కలిశారు. `పఠాన్` హిట్టు కొట్టినందుకు కంగ్రాట్స్ చెప్పారు. పనిలో పనిగా తదుపరి ప్రాజెక్టుపై కూడా మంతనాలు జరిపారు. బాలీవుడ్‌లో నేరుగా ఓ సినిమా చేయాలన్నది మైత్రీ ఆలోచన. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో మైత్రీ టచ్‌లో ఉంది. సిద్దార్థ్ – ప్రభాస్ ల సినిమా ఓకే అయితే… దీనికే మొదటి ప్రాధాన్యం. సిద్దార్థ్ కి ఆఫర్లు చాలా ఉండొచ్చు. కానీ తన దృష్టి మాత్రం ప్రభాస్ పై ఉంది. సో… ఈ కాంబో దాదాపుగా ఖాయమైనట్టే.