సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. ఈరోజు ఉదయం చెన్నైలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 70 ఏళ్లు. 1962 మార్చి 1న గుంటూరు జిల్లా నిడమర్రులో జన్మించారు సాగర్. ఎస్.ఎల్.సీ పాస్ అయ్యారు. ఆ తరవాత ఎడిటింగ్ డిపార్ట్ మెంట్లో చేరారు. నాయుడు గారి అబ్బాయి, కిరాయి కోటి గాడు లాంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. రాకాసి లోయ సినిమాతో దర్శకుడయ్యారు. ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ 1, అన్వేషణ, ఓసి నా మరదలా… ఇలా దాదాపు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అమ్మదొంగ, రామసక్కనోడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగానూ పనిచేశారు. వి.వి.వినాయక్, శ్రీనువైట్ల.. ఈయన శిష్యులే. వీళ్లే కాదు… పరిశ్రమలో దర్శకులుగా రాణిస్తున్న చాలామంది.. సాగర్ శిష్యులే.