సీక్రెట్ ఉండాల్సిన రిపోర్టులన్నీ బయటకు వస్తున్నాయి. గతంలో ప్రతిపక్ష నేతలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కొన్ని ఇంటలిజెన్స్ రిపోర్టుల్ని లీక్ చేశారు. కానీ ఇప్పుడు నేరుగా ప్రభుత్వానికి సంబంధించినవన్నీ లీక్ అవుతున్నాయి. ఇటీవల ఇంటలిజెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఓ సర్వే చేశారు. పకడ్బందీగా చేసిన ఈ సర్వే నివేదిక ముఖ్యమంత్రికి చేరిన వెంటనే… ఓ పత్రికకు చేరిపోయింది. ఆ పత్రిక రెండు రోజులుగా సవివరంగా కథనాలు ఇస్తోంది. దాన్ని ఖండించలేని పరిస్థితి.
మరో వైపు ఇంటలిజెన్స్ చీఫ్ తాము చేస్తున్న ట్యాపింగ్‌లను అందరికీ తెలిసేలా చేస్తున్నారు. తాము ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పడమే కాకుండా.. వారు మాట్లాడుకున్న ఆడియో లింక్‌ను నేరుగా వైసీపీ ఎమ్మెల్యేకే పంపడం అంటే.. మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్నాం… ఎదురు తిరిగితే ఏమైనా చేస్తాం.. ఆ భయంతో వణికిపోతారు.. నోరు తెరవురు అని ఇంటలిజెన్స్ చీఫ్ అనుకున్నారో లేకపోతే… అందరికీ తెలిసేలా చేసి ప్రభుత్వ పరువు తీయాలనుకున్నారో కానీ అడ్డంగా దొరికిపోయారు. తమ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని…. స్పష్టంగా తెలిసిన నాయకులు వైసీపీలో యాభై మంది వరకూ ఉన్నారంటున్నారు.
అదే సమయంలో కొన్ని ఐ ప్యాక్ రిపోర్టులు కూడా బయటకు వస్తున్నాయి. ప్రభుత్వంలోని అంతర్గత విషయాలూ బయటకు వస్తున్నాయి. ఇంటలిజెన్స్ నుంచి లీక్ కాకపోతే ఇన్ని విషయాలు బయటకు రావు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా ఇంటలిజెన్స్ చీఫ్.. ఇవన్నీ లీక్ చేస్తున్నారన్న అనుమానాలు వైసీపీ కార్యకర్తల్లో వినిపిస్తున్నాయి. విచిత్రంగా తాను ప్రభుత్వానికి బద్దుడిగా పని చేస్తున్నానని.. రాజకీయ ప్రయోజనాలు నెరవేరుస్తున్నానను కాబట్టి.. రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించి తనను డీజీపీని చేయాలని సీతారామాంజనేయులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.