పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు వేయించి ఉపఎన్నికలు తీసుకురావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు. ఇప్పడు ఉపఎన్నికలు నిర్వహించుకునే అవకాశం వారి చేతుల్లోనే ఉంది.. పార్టీని ధిక్కరించిన ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయి. ఈ ఉపఎన్నికల్లో గెలిస్తే తమకు ప్రజా వ్యతిరేకత లేదని అర్థం అయిపోతుంది. కానీ ఎందుకనో తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలను తీసుకోబోమని చెబుతున్నారు. వారిపై ఈగ వాలనీయబోమంటున్నారు.
ఎన్నికలకు ఇంకా పదిహేను నెలలకుపైగా సమయం ఉంది. ఇప్పుడు వారి సభ్యత్వాన్ని రద్దు చేసేస్తే కనీసం నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఆతర్వాత ఆరేడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి.. ఉపఎన్నికల్లో గెలిస్తే వస్తే పాజిటివ్ వేవ్ ఏంటో సీఎం జగన్ కు తెలుసు. అంతకు ముందే ఆయన ఉపఎన్నికలతోనే తన పార్టీకి సానుభూతి పెంచుకున్నారు. కానీ ఇప్పుడు ఉపఎన్నికల ఆలోచన చేయడం లేదు. ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నా తుడిచేసుకుంటున్నారు.
అసలు స్థానిక ఎన్నికలు జరగాల్సినవి చాలా ఉన్నాయి. పలు కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. నేరుగా ఉపఎన్నికలు జరపాల్సిన కౌన్సిలర్స్, జడ్పీటీసీ స్థానాలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఇలా జనాలతో ఓటింగ్ చేయించే ఎలాంటి ఎన్నికలకూ వెళ్లాలని అనుకోవడం లేదు. ప్రజా వ్యతరేకత బయట పడితే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.