గతంలో ఓ సారి అర్థరాత్రుళ్లు తన తండ్రితో జగన్ మాట్లాడతారని ఆర్కే ప్రకటించారు. ఆ విషయాన్ని ఆయనకు జగన్ చేతిలో అవమానికి గురైన ఓ రిటైర్డ్ ఐఏఎస్ చెప్పినట్లుగా హింట్ ఇచ్చారు. ఆ రిటైర్డ్ ఐఏఎస్‌కు జగన్ కు అత్యంత సన్నిహితులు . తర్వాత తేడా వచ్చింది.. తర్వాత ఆయనతో ఓపెన్ హార్ట్ చేశారు. తనకు ఆయన చెప్పిన విషయాన్న సర్కాస్టిక్ గా కొత్తపలుకులో రాసేశారు. ఇప్పుడు కూడా ఓ ఎమ్మెల్యే జగన్ ను ధిక్కరించారు. వెంటనే ఆయనతో ఓపెన్ హార్ట్ చేశారు. ఆయనతో పిచ్చాపాటిగా మాట్లాడిన విషయాన్ని అంతే సర్కాస్టిక్ గా మరోసారి వెల్లడించారు.
ఆ ఎమ్మెల్యే ఇటీవల వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో జగన్ పిలిపించి మాట్లాడారు. ఆ సమయంలో జగన్… తనకు విరక్తి వచ్చేస్తోందని.. హిమాలయాలకు వెళ్లి పోదామనుకుంటున్నానని చెప్పారట. ఈ మాటలు విని ఆ ఎమ్మెల్యే నవ్వు ఆపుకోలేక ఆపుకుని బయటకు వచ్చారు… ఇక తన వల్ల కాదు అనుకుని బయటపడ్డారట.. పార్టీ నుంచే కాదు.. ఈ అనుభవం గురించి కూడా. ఆ ఎమ్మెల్యే ఎవరో ఆర్కే తన కొత్త పలుకులో చెప్పలేదు కానీ.. ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని సులువుగా అర్థమైపోతుంది. ఆయనే ఈ వారం ఓపెన్ హార్ట్ ఇంటర్యూ గెస్ట్ కూడా.
కోటంరెడ్డి చెప్పిన తన వన్ టు వన్ ఇంటర్యూ లో జగన్ విశేషాలతో ఆర్కే ఈ వారం కొత్త పలుకును నింపేశారు. జగన్ నటనా కౌశలాన్ని వ్యంగ్య రీతిలో ప్రశంసిస్తూ.. ఆస్కార్ అవార్డు ఇవ్వాలని అనేక దృష్టాంతాలు రాశారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలిపై వైసీపీ నాయకుల్లోనే అనేక చిత్ర, విచిత్ర ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఓ స్టేచర్ ఉన్న నేతలు చెప్పినప్పుడు వాటిని మరింత బాగా ప్రజల్లోకి తీసుకెళ్లి… కామెడీ చేయడానికి ఆర్కే తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. జగన్ వ్యవహారశైలి అంతా నటన.. ఆయన అసలు రూపం వేరే ఉంటుందని … గట్టి అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
విచిత్రంగా తన కొత్తపలుకు కథనాలు… బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తూ తన పత్రికలో వస్తున్న కథనాలపై కేసీఆర్ పత్రిక ఎదురుదాడి చేస్తున్న అంశంపై ఆర్కే పెద్దగా పట్టించుకోలేదు. కౌంటర్ ఇస్తారేమో అనుకున్నారు. కానీ నమస్తే తెలంగాణ పత్రికను కేసీఆర్ కూడా చదవరన్న గట్టి నమ్మకంతో ఉన్న ఆయన… కౌంటర్ ఇస్తే మరింత ప్రాచుర్యం కల్పించినట్లు అవుతుందని సైలెంట్ అయినట్లుగా ఉన్నారు. అయితే కేసీఆర్ ను ఏదో ఒకటి అనకపోతే బాగుండదని అనుకున్నారేమో కానీ…. విశ్వనాథ్ కు నివాళి అర్పించలేదు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదు లాంటి రొటీన్ విమర్శలు చేశారు.