పార్టీని ధిక్కరించిన కోటంరెడ్డి సెక్యూరిటీని టూ ప్లస్ టూ నుంచి వన్ ప్లస్ వన్ కు తగ్గించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని మీడియాలో బాగా ప్రచారం అయ్యేలా చేసుకుంది. అంతకు ముందే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తితో ఫోన్ చేయించి… ఎలా చంపుతామో కూడా చెప్పించి… ఆ కాల్ ను సోషల్ మీడియాలో పెట్టించారు. ఆనం రామనారాయణరెడ్డి కికూడా అలాగే చేసింది. ఆయన తనకు ప్రాణహాని ఉందని.. తన హత్యకు కుట్ర చేస్తున్నారని నేరుగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు.. ప్రభుత్వం మొదటి నుంచి ఇలా సెక్యూరిటీ పెంచడం.. తగ్గించడంతో పొలిటికల్ గేమ్ ఆడుతోంది.
ప్రభుత్వం మారగానే చంద్రబాబు సెక్యూరిటీని టూ ప్లస్ టూకి పరిమితం చేశారు. తర్వాత ఆయన కోర్టుకువెళ్లాల్సి వచ్చింది. టీడీపీ నేతలందరి భద్రత తొలగించారు. చాలా మందిలో ప్రాణభయం కల్పించి… వారిని టీడీపీ నుంచి దూరం చేసి వైసీపీలో చేర్చుకునే ప్రయత్నం చేశారు. కొంత సక్సెస్ అయ్యారు కూడా. టీడీపీలో ఉండగా సెక్యూరిటీని తీసేసిన.. శిద్దా రాఘవరావుకు.. ఆయన వైసీపీలో చేరగానే డబుల్ సెక్యూరిటీ కల్పించారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి.
అయితే ఇదంతా అధికారంలోకి వచ్చిన కొత్తలో. ఇప్పుడు సెక్యూరిటీని త గ్గించి ప్రాణ భయం కల్పిస్తామంటే ఎవరూ భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే… అందరూ రాజకీయాల్లో ఉన్నవారే. జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు. ధిక్కరిస్తే చంపేస్తామని బెదిరిస్తే.. కొన్నాళ్లు భయపడతారు.. ఎల్లప్పుడూ భయపడరు. ప్రభుత్వం పై భ యం తగ్గినప్పుడు అందరూ ఈ అంశాన్ని కామెడీ చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని.. సెక్యూరిటీ తగ్గిస్తున్న వాళ్లు తెగేసి చెబుతున్నారు.