కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ, శ్రావణ శుద్ధ నవమి, శుక్రవారం సూర్యోదయం నుండి మొదలవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్దాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ సిద్దాంతి చెప్పడంతో అదే విషయాన్నీ ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారంనాడు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇదివరకు గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేసింది. కానీ దానిలో చాలా వరకు తాత్కాలిక సదుపాయాలు, ఏర్పాట్ల కోసమే ఖర్చయిపోవడంతో పుష్కరాల తరువాత ఆ ప్రాంతాలన్నీ మళ్ళీ యధాప్రకారం సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కనుక ఈసారి కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులలో అధిక శాతం శాశ్విత నిర్మాణాలకు, అభివృద్ధి పనులకే ఖర్చే చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
కృష్ణా పుష్కరాలకు నోడల్ అధికారిగా విజయవాడ నగరపాలక కమీషనర్ గా పనిచేస్తున్న ఐ.ఏ.ఎస్. అధికారిణి ఎస్.నాగలక్ష్మిని నియమించారు. ఈ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో జిల్లా కేంద్రంలో రోడ్ల మరమత్తులు, సుందరీకరణ పనులు, గుంటూరు-అమరావతి రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలను కలిపే అన్ని రోడ్లను మరమత్తులు చేసి అందంగా తీర్చి దిద్దాలని సూచించారు. పుష్కరాలు జరిగే అన్ని ప్రాంతాలలో తాత్కాలికంగా వీధి దీపాలు, టాయిలెట్లు వంటి సదుపాయాలు కల్పించే బదులు వాటినే శాశ్విత ప్రాతిపదికన ఏర్పాటు చేసినట్లయితే, పుష్కరాల తరువాత కూడా స్థానిక ప్రజలకు ఉపయోగపడతాయని పిసిసి అధ్యక్షుడు టక్కర్ అధికారులకు సూచించారు.
ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు దానివలన ప్రజలకు శాస్వితంగా ఉపయోగపడే పనులు చేయాలనుకోవడం మంచి ఆలోచనే! ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఐ.వై.ఆర్. కృష్ణారావు హయంలో జరిగిన గోదావరి పుష్కరాలకి, ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పిసిసి అధ్యక్షుడు టక్కర్ నేతృత్వంలో ఆగస్టులో జరుగబోయే కృష్ణా పుష్కరాలకి చాలా తేడా ఉండబోతోందని అర్ధమవుతోంది.