సమంత ‘శాకుంతలం’ మళ్ళీ వాయిదా పడింది. గతేడాది నవంబరులోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. గ్రాఫిక్స్ పనులు ఆలస్యమవడం వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పనులన్నీ కొలిక్కి రావడంతో ఈ నెల 17న విడుదల చేయాలని భావించారు. కానీ, ఇప్పుడీ సినిమాని మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘’ప్రేక్షకులకు ఈ విషయాన్ని చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాం. ఈ నెల 17న ‘శాకుంతలం’ను విడుదల చేయలేకపోతున్నాం. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ టీం వెల్లడించింది.
కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల – దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రమిది. ఇప్పటికే ట్రైలర్ వదిలారు . మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదల వాయిదాలు పడటంతో ట్రైలర్ తో వచ్చిన బజ్ కాస్త తగ్గిపోయే పరిస్థితి నెలకొంది.