తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు ఇతర కారణాలు ఏవైనా కానీ అనుకున్నంతగా ఆయనకు మైలేజీ రాలేదు. మీడియాలో కవరేజీ రావడం లేదు. కానీ ఆయన పాదయాత్రకు హైప్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. దానికి రేంత్ పాదయాత్రలో చేసిన కొన్ని కామెంట్లను ఉపయోగించుకుంటున్నారు. ములుగు నియోజకవర్గంలో పాదయాత్ర చే్తున్న రేవంత్ రెడ్డి అప్పట్లో దొరల గడీలను నక్సలైట్లు పేల్చేసేవారని..ఇప్పుడు ప్రగతి భవన్ ను పేల్చి వేసినా ఎవరికీ అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.
దలకు కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు గానీ, హైదరాబాద్ మధ్యలో మాత్రం 2 వేల కోట్లు ఖర్చు పెట్టి 150 గదులతో ప్రగతి భవన్ కట్టుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రగతి భవన్‌లోకి పేదలకు ప్రవేశమే లేదని అన్నారు. అలాంటి ప్రగతి భవన్ ఎందుకని మండిపడ్డారు. ఆనాడు గడీలను నక్సలైట్లు గ్రానేట్‌లతో పేల్చేవారని, ఇప్పుడు బాంబులతో ప్రగతి భవన్‌ను పేల్చి వేయాలంటూ ఘాటుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ ఆనాటి గడీలను తలపిస్తుందని అన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. ముఖ్య నేతలంతా రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పై డీజీపీకి ఫిర్యాదు చేయాలని… కేసు పెట్టాలని ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ ేనతలు ప్రకటించారు. రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకపోతే యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. తన వ్యాఖ్యలు సరైన చోట తగిలాయని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఈ వివాదాన్ని మరింతగా పెంచుతున్నారు. తనపై కేసులు పెట్టినా సరే తాను అన్న మాటలపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు. నక్సలైట్ల అజెండాను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి దొరల పాలన చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ వివాదంతో రేవంత్ పాదయాత్రకు ప్రచారం లభిస్తోంది.