ప్రభాస్ పై వచ్చిన, వస్తున్న రూమర్లకు లెక్కే లేకుండా పోతోంది. తాజాగా మరోటి గట్టిగా వినిపిస్తోంది.ప్రభాస్‌కి ఆరోగ్యం సరిగా లేదని, తను కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉందని… కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజం ఏమిటంటే.. ప్రభాస్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగులో బిజీగా ఉన్నాడు. సలార్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఆ సెట్లో ప్రభాస్ తలమునకలై ఉన్నాడు. ఇదే వారంలో `ప్రాజెక్ట్ కె`కి కూడా రెండు మూడు రోజులు కేటాంచాడు. ఈనెలలోనే మారుతి సినిమాకి సైతం ప్రభాస్ కొన్ని కాల్షీట్లు ఇచ్చాడని సమాచారం. ఈనెల 18న ప్రభాస్ – మారుతి సినిమా కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఇలాంటి సమయంలో.. ఇలాంటి ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ – కృతి శెట్టిల నిశ్చితార్థం విషయంలో ఇలాంటి గాలి వార్తలకు ఊపు ఎక్కువైంది. తామిద్దర మధ్యా ఏమీ లేదని ప్రభాస్ అన్‌స్టాపబుల్ లో క్లారిటీ ఇచ్చాడు. అయినా ప్రభాస్ పై ఈ వార్తలకు పుల్ స్టాప్ పడడం లేదు.