ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని సినిమా నిర్మాణం రంగంలోకి అడుగుపెడుతున్నారని తెలిసింది. 2014లో తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడదల రజిని.. 2018లో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. గత క్యాబినెట్ విస్తరణ ఆమెకు మంత్రి పదవి కూడా వరించింది.
అయితే ఇప్పుడామెకు సినిమా రంగంపై ఆసక్తి ఏర్పడింది. నిర్మాతగా సినిమాలు తీయాలని నిర్ణయించారు. ఇప్పటికే హైదరాబాద్ లో సినిమా ఆఫీస్ తీసుకున్నారు. తొలి సినిమాకి కథ కూడా రెడీ అయ్యిందని సమాచారం. దర్శకుడు, హీరో ఎవరనే సంగతి త్వరలోనే తెలుస్తుంది. భారీ స్థాయిలోనే ఈ సినిమా వుండే అవకాశం వుంది.