2012లో యుగాంతమని జరిగిన ప్రచారం అప్పట్లో ఒక సునామీలా వ్యాపించింది. నిజంగానే చాలా మంది ప్రజలు ఆ వార్తని నమ్మారు. అయితే చివరికి అది గాలి వార్తగా మిగిలిపోయింది. ఇప్పుడు అదే నేపధ్యంలో కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బెదురులంక 2012’ . నేహశెట్టి కథానాయిక. క్లాక్స్ దర్శకుడు. తాజాగా టీజర్ వదిలారు,
`2012 డిసెంబర్ 21 కి డెడ్ లైన్..ఆ తరువాత ఏం జరుగుతుంది? అంటూ టీవీలో యుగాంతం వార్తలతో టీజర్ మొదలైయింది. ఈ గాలి వార్తని బెదురులంక ప్రజానీయం బలంగా నమ్ముతుంది. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ? ఎలా కామెడీ డ్రామా పుట్టింది ? అనేది ఆసక్తికరంగా చూపించారు. విలేజ్ నేపధ్యంలో కామెడీ, యాక్షన్, డ్రామా అన్నీ వున్నాయి, కార్తికేయ, నేహ కెమిస్ట్రీ బావుంది. టీజర్ లో అజయ్ ఘోష్ కీలకంగా కనిపించారు. సత్య ఓ సీన్ లో నవ్వించాడు. మణి శర్మ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. చివర్లో కార్తికేయ ఎదో విదేశీ భాష మాట్లడుతూ టీజర్ ఎండ్ చేయడం కూడా నవ్వించింది. మార్చిలో బెదురులంక థియేటర్లోకి వస్తోంది.