ఏపీ ప్రజధనాన్ని పథకాలుగా పంపిణీ చేసింది చాలకా… ఆ డబ్బు జగన్ ఇస్తున్నట్లుగా స్టిక్కర్లు మొహానికి అంటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటింటికి స్టిక్కర్ అంటించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. పథకాలు అందిన ఇంటికి అని చెబుతారు కానీ.. స్టిక్కర్లు తీసుకుని అన్ని ఇళ్లకూ అంటించేయనున్నారు. సరే ఇళ్లు కదా అనుకుంటే.. ఇప్పుడు సెల్ ఫోన్ పైనా అంటించాలని ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులు వాడే సెల్ ఫోన్లకు జగనన్న నమ్మకం అనే స్టిక్కర్లు అంటించనున్నారు.
ఈ మేరకు ఇప్పటికే అంటించడాలు కూడా ప్రారంభమయ్యాయి. పథకం అందుకున్న ఇంట్లో ఎంత మంది ఉంటే వారందరి సెల్ పోన్లకు స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇదేం బాధ అంటే… అంటే పట్టించుకునేవారు లేరు. ఎంత పథకాలు ఇస్తే మాత్రం ఇంటికి ఒంటికి కూడా స్టిక్కర్లు అంటిస్తారా అని ప్రశ్నిస్తే ఎక్కడ కేసులు పెడతారో.. ఎక్కడ వచ్చి అల్లరి మూక దాడి చేస్తుందోనన్న భయంతో ప్రజలు కిక్కుమనలేని పరిస్థితి ఏర్పడుతోంది.
స్టిక్కర్లు ఇవాళ ఉండి రేపు ఊడిపోతాయి. ఇదంతా ఎందుకు అని… తర్వాత ఘనత వహించిన పెద్దలకు… పథకాలు తీసుకున్న వారి మొహన.. జగనన్న అని పచ్చ బొట్టు వేయించాలన్న ఆలోచన వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇదేమిటని అడగడానికి అప్పటికి జనం దగ్గర ఇప్పటికి ఉన్న ధైర్యం కూడా ఉండకుండా… అరాచకం చేసేసి ఉంటారు.. అనుభవించాల్సిందే