గత నెల ఇరవై ఏడో తేదీన ప్రారంభమైన నారా లోకేష్ పాదయాత్ర ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా రెండు వందల కిలోమీటర్లు సాగింది. పాదయాత్ర షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. రోజుకు నాలుగైదు సమావేశాలు పెట్టుకుంటున్నారు. సెల్ఫీలు తీసుకోవాలనుకునేవారికి ఓపికగా సమయం కేటాయిస్తున్నారు. అన్ని వర్గాలతో మాటా మంతీ జరుపుతున్నారు. పార్టీ నేతలకు సమయం కేటాయిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి అర్థరాత్రి వరకూ చాలా బిజీగా ఉంటున్నారు. అన్నింటికీ మించి పాదయాత్రపై జరుగుతున్న కుట్రల విషయంలోనూ అప్రమత్తంగా ఉంటున్నారు. పాదయాత్ర విషయంలో లోకేష్ మల్టీ టాస్కింగ్ అందర్నీ అబ్బుర పరుస్తోంది.
లోకేష్ పాదయాత్రలో కనిపించి సమస్యలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి.. ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందని చెప్పడం లేదు. కుదిరితే అప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నారు. లేకపోతే. భరోసా ఇస్తున్నారు. అన్నీ తాను చేసేస్తాని చెప్పడం లేదు. ఇచ్చేస్తానని అనడం లేదు. ప్రభుత్వ పరంగా ఎలాంటి విధానాలు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయో అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. నిజమే కదా అని ప్రజలు ఆలోచించుకుంటున్నారు. ఇంజినీరింగ్ కోర్సులు నాలుగేళ్లు చేసినా అమీర్ పేటలో మూడు నెలల కోర్సు చేస్తే కానీ ఉద్యోగం రాదు.. ఎందుకిలా ? ఆ అమీర్ పేట కోర్సులు కాలేజీల్లోనే ఎందుకు నేర్పకూడదు… తాము రాగానే ఆ విషయంపై దృష్టి పెడతామని లోకేష్ చేసిన ప్రకటన… యువతను ఆకట్టుకుంది. ఇలాంటి విజనే కదా కావాల్సింది అనుకునేలా చేసింది.
ప్రతీ విషయంలోనూ అంతే. ప్రజల సమస్యలకు ప్రభుత్వం డబ్బులివ్వడమే పరిష్కారం. కాదని.. ఆ డబ్బులను ప్రజల నుంచే వసూలు చేస్తారని… కానీ సమస్యల పరిష్కారానికి కావాల్సింది.. అసలు ప్రొడక్టివిటీ అని చెబుతున్నారు. అది కూడా సామాన్యులకు అర్థమయ్యేలా చేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకం గురించి అందరూ ఆలోచించేలా చేస్తున్నారు. లోకేష్ మాటలు విన్నవారు… ఆయనతో మాట్లాడిన వారు ఫిదా కాకుండా ఉండలేరు. విజన్ గురించి అభినందించకుండా ఉండలేరు.
పాదయాత్ర తప్పుడు ప్రచారానికి .. ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చేయడానికి.. జనాలు లేరు అని చెప్పడానికి వైసీపీ … వందల మందితో సోషల్ మీడియా నిర్వహించడమే కాదు.. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోంది. మాట్లాడనీయడం లేదు. అంతే కాదు ఇంటలిజెన్స్ లో ఓ వింగ్ మొత్తం వైసీపీ సోషల్ మీడియా కోసం పని చేస్తోంది. ఇంత ఎక్కువగా లోకేష్ పాదయాత్రపై వారు దృష్టి పెట్టడం.. పాదయాత్ర సక్సెస్ ను తెలియచేస్తోంది. మొత్తంగా లోకేష్ నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యంలో రెండు వందల కిలోమీటర్లకే తన డిఫరెన్స్ చూపించారు. ఆ ఉత్సాహమే జయహో అనేలా చేస్తోంది.