ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్‌ను చత్తీస్ ఘడ్కు కేంద్రం బదిలీ చేసింది. ఏపీ గవర్నర్ గా జనవరిలో పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అయోధ్యకేసుతో పాటు ట్రిపుల్ తలాక్ కేసులపై తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తుల ధర్మాసనంలో అబ్దుల్ నజీర్ కూడా ఒకరు. ఆయన ఇలా సుప్రీంకోర్టుకు పదవీ విరమణ చేయాగనే ఇలా గవర్నర్ గా పదవి ఇవ్వడం సంచలనంగా మారింది.
ఈ బదిలీతో పాటు మరికొన్నిరాష్ట్రాలకు గవర్నర్ల నియమాకం చేశారు. కానీ ఏపీ గవర్నర్ బదిలీ మాత్రం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్ గా యాక్టివ్ గా లేరు. ఆయన వయసు రీత్యా కూడా అంత చురుగ్గా ఉండలేరు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం పంపుతున్న వివాదాస్పద బిల్లులు, నిర్ణయాలన్నింటికీ ఆమోద ముద్ర వేస్తూ వచ్చారు. ఆయన ఆమోదించిన బిల్లులు కోర్టుల్లో కూడా వీగిపోయాయి. దీంతో గవర్నర్ పై కూడా విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం గవర్నర్ ను హామీగా చూపించి రుణాలు తీసుకున్నా ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.
ఏపీ ప్రభుత్వం.. కేంద్రంతో సన్నిహితంగా ఉంటుంది. ఈ కారణంగా గవర్నర్ వ్యవహారాలు అంతా కామనే అనుకున్నారు. కానీ ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏముందనేది వైసీపీ నేతలకూ అంతుబట్టడం లేదు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గవర్నర్ గా రావడం వల్ల అన్ని అంశాలను సీరియస్‌గా పట్టించుకుంటే.. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే వివాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.