బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచిదని ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ చాలా బాగా పరిపాలించారని.. ఆయన హయాంలో దేశం ఆర్థికంగా వృద్ధి సాధించిందని.. పైగా 14 శాతం అప్పులను తగ్గించారని అన్నారు. కానీ మోదీ హయాంలో వృద్ధి పడిపోవడమే కాదు 54 శాతం అప్పులు పెంచారని మండిపడ్డారు. మన్మోహన్ సింగ్ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసింది.. మోడీ కంటే మన్మోహన్సింగ్ ఎక్కువ పనిచేశారు.. కాంగ్రెస్ బాగా పనిచేయలేదని 2014లో మోడీకి ఓటేశారు.. పెనంపై నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది.. మన్మోహన్ కంటే మోడీ పాలనలో దేశం ఎక్కువ నష్టపోయిందని కేసీఆర్ అసెంబ్లీలో విరుచుకుపడ్డారు.
నరేంద్రమోదీ అసెంబ్లీలో చేసిన ప్రసంగంపైనా విమర్శలు గుప్పించారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేందని ప్రశ్నించారు. నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని అంటూ మోడీ, రాహుల్ గొడవపడుతున్నారు.. దేశం పరిస్థితి క్రిటికల్‌గా ఉంటే మోడీ మాట్లాడరని విమర్శించారు. హిండెన్ బర్గ్ నివేదికపై మోదీ మాట్లాడటం లేదని విమర్శించారు. దేశానికి ఒక లక్ష్యం అంటూ లేకుండా పోయిందన్నారు.
తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారత్ ర్యాంక్ తక్కువ.. 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్.. మనదేశం 3.3 ట్రిలయన్ డాలర్ల దగ్గరే ఆగిపోయింది.. మొత్తం 192 దేశాల్లో మనదేశం ర్యాంక్ 139 ర్యాంక్ అని తేల్చారు. . మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియా అయ్యింది.. నా మాటకు కట్టుబడి ఉంటా.. కాంగ్రెస్, బీజేపీ దేశాన్ని ముంచాయి.. కాంగ్రెస్‌ది లైసెన్స్‌రాజ్, మోడీది సైలెన్స్‌రాజ్.. అని విమర్శించారు. తాను చెప్పినదాంట్లో ఒక్క అబద్ధం ఉన్నా రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ చేశారు
NDA అంటే నో డేటా అవైలబుల్ అవి సెటైర్ వేశారు. దేశ ఆర్థిక మంత్రి వచ్చి కామారెడ్డిలో రేషన్ డీలర్‌తో మోదీ ఫోటో కోసం కొట్లాడిందని… ఏం సాధించాడని మోడీ ఫొటో పెట్టాలి?.. ఒక్క వందే భారత్ రైలును మోడీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారు?.. బర్రె గుద్దితే వందే భారత్ రైలు పచ్చడైందని విమర్శించారు. 2024 తర్వాత బీజేపీ ఖతం.. బంగ్లాదేశ్ వార్ తర్వాత ఇందిరాగాంధీని వాజ్‌పేయి కాళికా అన్నారు.. అలహాబాద్ కోర్టు తీర్పుతో ఇందిరాగాంధీ ప్రభుత్వం కూలిపోయింది.. తర్వాత వచ్చిన జనతా పార్టీ కొన్ని తప్పులు చేసింది… అనంతరం మళ్లీ ఇందిరాగాంధీకే పట్టం కట్టారని గుర్తు చశారు.