ఏపీ సీఎం జగన్ పై పవన్ కల్యాణ్‌కు మరోసారి కోపం వచ్చింది. ఆయన కు పరిపాలన చేతకాకపోవడం వల్ల రాష్ట్రం పూర్తిగా నాశనం అవుతోందని నేరగాళ్లు పేట్రేగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలో ఆయన ఇంటికి సమీపంలోనే ఓ అంధ యువతిని ఓ సైకో పట్టు పగలు నరికి చంపేశాడు. దీనికి కారణం గంజాయి మత్తులో ఉండటమేనని పోలీసులు తేల్చారు. గతంలోనూ ఆ సైకోపై మహిళలపై దాడులు చేసిన కేసులు ఉన్నాయి. సీఎం ఇంటి పరసరాల్లో హై సెక్యూరిటీ ఉంటుదని అయినా పట్టపగలు ఇలాంటి ఘటన జరగడం అంటే.. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లేనా అని పవన్ ప్రశ్నిస్తున్నారు
ఏడాదిన్నర క్రితం సీఎం జగన్ ఇంటికి సమీపంలో కృష్ణనదిలో జరిగిన అత్యాచార ఘటన సంచలనం సృష్టించింది. కాసేపు ఇసుక తిన్నెల్లో మాట్లాడుకుందామని వచ్చిన ఓ జంటలో యువకుడ్ని కొట్టి యువతిపై అత్యాచారం చేశారు. మొత్తం మగ్గురు దారుణానికి పాల్పడ్డారని గుర్తించారు. ఇద్దర్ని పట్టుకున్నారు. వెంకటరెడ్డి అనే మూడో నేరస్తుడ్ని మాత్రం ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. ఇంత వైఫల్యం ఎవరిదని పవన్ ప్రశ్నించారు. అవార్డులు వచ్చాయి.. దిశా చట్టమని కబుర్లు చెప్పడం తప్ప రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు.
రేప్ బాధితులకు అండగా ఉండకపోగా.. తల్లి పెంపకం గురించి హోంమంత్రి మాట్లాడుతున్నారని ఇలాంటిరాష్ట్రంలో మహిళలకు రక్షణ, భ రోసా ఎక్కడి నుంచి వస్తుందని పవన్ ప్రశ్నించారు. ఏపీలో పరిస్థితిపై మేదావుల, మహిళా సంఘాలు, న్యాయనిపుణులు గళమెత్తాలని పవన్ పిలుపునిచ్చారు