హైదరాబాద్‌లో రవీంద్ర భారతి ఎలాగో విజయవాడలో తుమ్మపల్లి కళాక్షేత్రం అలా. దశాబ్దాలుగా తుమ్మలపల్లి కళాక్షేత్రం అలా పేరు ప్రఖ్యాతులు సాధించుకుంది. ఈ తుమ్మల పల్లి కళాక్షేత్రం అసలు పేరు తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం. కానీ ఇప్పుడు కాదు.. ఇప్పుడు కళాక్షేత్రం అని మాత్రమే ఉంది. ప్రభుత్వం తుమ్ములపల్లి .. క్షేత్రయ్య పేర్లను తీసేసింది. వారు ప్రభుత్వ పెద్దలకు నచ్చని సామాజికవర్గాలకు చెందిన వారేమో కానీ.. కొత్త పేరు పెట్టడానికి టైం తీసుకుంటోంది. బహుశా… ఎప్పుడైనా ఓ వివాదం రావాలి.. కావాలనుకున్నప్పుడు.. దానికి రాజయ్య లేకపోతే రాజారెడ్డి కళాక్షేత్రం ఇంకా కావాలనుకుటే జగనన్న కళాక్షేత్రం అని అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
అసలు తుమ్మలపల్లి, క్షేత్రయ్య అనే పేర్లతో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి ? ఆ కళాక్షేత్రం ఉన్న స్థలం తుమ్మలపల్లి శ్రీహరి నారాయణ పంతులు అనే పెద్దాయన్న దానం చేశారు. ఆయన దానకర్ణుడిగా పేరు పొందారు. స్థలం ఇచ్చిన వారి పేరు పెట్టడం సహజం అందుకే ఆయన పేరు పెట్టారు. తర్వాత మహాకవి, వాగ్గేయకారుడి పేరుతో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం అని పేరు పెట్టారు. ఇలాంటి పేర్లుపై ఎవరికీ అభ్యంతరాల్లేవు. గత ప్రభుత్వం ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేసింది. ఈ ప్రభుత్వం పేరు మార్చేసింది.
అసలు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇలా మహనీయుల జ్ఞాపకాలపై ఇలా దాడులు చేస్తుందో చాలా మందికి అర్థం కావడం లేదు. వారేమీ రాజకీయాల్లో లేరు. రాజకీయ వారసులు కూడా లేరు. ఆయా వారసుల్ని ఇబ్బంది పెట్టడానికి ఇలా చేశారని .. రాజకీయం అనుకోవడానికి. మనిషి బుద్ది ఎంత అల్పమైతే.. అంత దిగజారుడు ఆలోచనలు వస్తాయన్నట్లుగా .. ప్రభుత్వం పేర్ల మీద పడిపోతోంది . ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చారు.. ఎన్నో వేల మంది వైద్యవిద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పుడు… కళాక్షేత్రాల మీద పడ్డారు. ఎక్కడ ఏ పేరు కనిపించినా వదలడం లేదు.