వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును … ఏపీ మాజీ చీఫ్ డిజిటల్ డైరక్టర్ .. ఇప్పుడు అడవుల కార్పొరేషన్ పదవి అనుభవిస్తున్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి క్షమాపణ వేడుకున్నారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశానని తప్పయిపోయిందని… ఇంకెప్పుడు అలా అనని ఆయన లిఖిత పూర్వకంంగా రాసిచ్చారు. గతంలో చీఫ్ డిజిటల్ డైరక్టర్ పేరుతో ప్రజాధనం జీతంగా తీసుకుంటూ… వైసీపీ సోషల్ మీడియాకు ఇంచార్జ్ గా ఉండేవారు. ఆ సమయలో ఆయన రఘురామకృష్ణరాజుపై సోషల్ మీడియాలో అసభ్యంగా విరుచుకుపడేవారు.
రఘురామకృష్ణరాజు ఆయన తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన లోకాయుక్తకు… తప్పయిపోయిందని.. క్షమించాలని గుర్రంపాటి వివరణ ఇచ్చారు. దీన్ని లోకాయుక్త రఘురామకు పంపారు. అయితే రఘురామ నుంచి ఎలాంటి రిప్లయ్ రాకపోవడం తో గుర్రంపాటి క్షమాపణను అంగీకరించి…. అదే సమయంలో ఆయన ప్రస్తుతం డిజిటల్ డైరక్టర్ గా లేనందున… ఆ విషయం ఇక తేల్చాల్సిన అవసరం లేనందున కేసు ముగిస్తున్నట్లుగా లోకాయుక్త జస్టిస్ లక్ష్మణరెడ్జి తేల్చారు.
గుర్రంపాటి దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి నేతృత్వంలోని సోషల్ మీడియానే న్యాయవ్యవస్థపై దాడి చేసింది. వ్యవస్థీకృతంంగా జరిగిన ఈ దాడి విషయంలో సీబీఐ కూడా దేవేందర్ రెడ్డిని ప్రశ్నించింది. తనకు ఇచ్చిన పదవిని అడ్డం పెట్టుకుని … జగన్ పై విధేయత చూపడానికి ఇతర పార్టీల నేతలపై బూతులతో విరుచుకుపడతాడు గుర్రంపాటి. ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పారు. సొంత ప్రభుత్వంలోనే ఇలా చెప్పాల్సి వచ్చిందంటే… ప్రభుత్వం మారితే ఎలా ఉంటుందోనని ఆయన బాధిత సోషల్ మీడియా కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. .