అదానీ కంపెనీలు తమ నిజాయితీని నిరూపించుకుంటామని… హిండెన్ బెర్గ్ చేసిన ఆరోపణలు తప్పని నిరూపిస్తామని ప్రకటించింది. ఇందు కోసం అమెరికాకు చెందిన గ్రాంట్ తోర్నటన్ ఎల్ఎల్పీ అనే సంస్థను ఎంపిక చేసుకుంది. ఈ సంస్థకు అన్ని రకాల అకౌంట్లు అందుబాటులోకి ఉంచుతారు. ఈ సంస్థ స్వతంత్ర అడిట్ నిర్వహించి… అదానీ సంస్థ అక్రమాలకు పాల్పడిందో లేదో నిర్దారిస్తుంది. ఇది తమ నిజాయితీకి సాక్యంగా అదానీ గ్రూపు చెప్పుకుంటోంది.
కానీ గ్రాంట్ తోర్నటన్ అనే పేరు అదానీ గ్రూప్ నుంచి వినిపించగానే…. ఇంత కన్నా గొప్ప సంస్థను ఎంచుకుంటారని ఊహించలేమని సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే … అకౌంటింగ్ మోసాలు కప్పిపుచ్చేందుకు … క్లయింట్లకు కావాల్సిన విధంగా ఆడిటింగ్ చేసేందుకు గ్రాంట్ తోర్నటన్ పని చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే కాదు.. ఎన్నో సార్లు నిజమైంది. ఈ కారణంగా పలు దేశాల్లో గ్రాంట్ తోర్నటన్ సంస్థపై అక్కడి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు జరిమానాలు విధించాయి. ఇదంతా బహిరంగ రహస్యం.
ఇప్పుడు ఇదే కంపెనీతో అదానీ గ్రూప్ అడిటింగ్ చేయించుకుంటోంది. కేవలం సొంత రిపోర్టులు తయారు చేసి దానిపై గ్రాంట్ తోర్నటన్ ముద్ర వేయించుకుంటారని.. ఈ ఆడిట్ లో అంతకు మించి ఏమీ తేలదన్న ప్రచారం ఇప్పటికే ప్రారంభమయింది. ఈ కంపెనీ సీరియస్గా ఆడిట్ చేసినా ఎవరూ నమ్మరు. ఆ స్వతంత్ర ఆడిటింగ్ వల్ల.. అదానీ గ్రూపులకు కొత్తగా వచ్చే విశ్వసనీయత ఏమీ ఉండదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.