ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థ శ్రీ చైతన్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగమనేని రమేష్ మధ్య వందల కోట్ల వివాదం నడుస్తోంది. ఇంత కాలం గుంభనంగా ఉన్న ఈ వ్యవహారాన్ని చైతన్య చైర్మన్ బీఎస్ రావు మీడియా ముందుకు తెచ్చారు. దీంతో ఇది సంచలనం అయింది. బీఎస్ రావు చెబుతున్న దాని ప్రకారం ఎప్పుడో పదేళ్ల కిందటే చైతన్య కాలేజీలకు అవసరమైన భవనాలు, భూమి సేకరిస్తామని చెబితే… రూ. మూడు వందల కోట్లకుపైగానే లింగమనేనికి బీఎస్ రావు ఇచ్చారు. కానీ లింగమనేని వాటిని సమకూర్చలేదు. డబ్బులు కూడా ఇవ్వలేదు.
దీనిపై బీఎస్ రావు పోలీసు కేసులు పెట్టి.. న్యాయపోరాటం ప్రారంభించారు విషయం ఎన్సీఎల్టీ,, సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. అయితే ఇంకా తేలలేదు. కానీ ఇప్పుడు బీఎస్ రావు లింగమనేని పరువు తీయాలనుకున్నారు. మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. సహజంగా ఆయన కార్పొరేట్ కాలేజీ అధిపతి. పెద్ద ఎత్తున ప్రకటనలు మీడియాకు ఇస్తూంటారు. అందుకే ఆయన ప్రెస్ మీట్‌కు కవరేజీ వచ్చింది దీనిపై లింగమనేని రమేష్ కూడా స్పందించారు. బీఎస్ రావు చెబున్నంత మొత్తంలో తమ మధ్య వివాదం లేదని.. ఆయన ప్రకటించారు. దీనిపై న్యాయస్తానాల్లో కేసులు ఉన్నాయని.. అవి ఇంకా తేలాల్సి ఉందన్నారు. బీఎస్ రావుకు అనుకూలంగా ఎక్కడా తీర్పు రాలేదన్నారు.
లింగమనేని రమేష్ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నారు. కరకట్టపై చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా లింగమనేనిదే. ఆయనపై పలు రకాలుగా వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. కేసులు కూడా నమోదు చేసింది. కానీ ఏ ఆరోపణలు నిరూపించలేకపోయారు. ఇప్పుడు బీఎస్ రావు తెరపైకి వచ్చారు.